ETV Bharat / bharat

కరోనా వైరస్ ప్రొటీన్​ కీలక గుట్టు కనుగొన్న శాస్త్రవేత్తలు - కరోనా వైరస్​ కీలక సమాచారం

కరోనా వైరస్​లోని ప్రొటీన్​కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఐఐటీ- మండి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది వైరస్​ను లోతుగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు. తద్వారా మెరుగైన చికిత్సలను రూపొందించడానికి ఈ పరిశోధన కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.

corona
కరోనా వైరస్
author img

By

Published : May 28, 2021, 7:15 AM IST

కరోనా వైరస్​లోని ప్రొటీన్​కు సంబంధించిన కీలక గుట్టును ఐఐటీ- మండి శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మహమ్మారిని మరింత లోతుగా అర్థం చేసుకుని, మెరుగైన చికిత్సలను రూపొందించడానికి ఈ పరిశోధన కీలకంగా మారనుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్​ చికిత్సలన్నీ లక్షణాల ఆధారంగా రూపొందించినవే. వైరస్​ను చిక్కించుకుని, దాన్ని అణచివేసే సరైన ఔషధం ఇప్పటికీ లేదు. ఇలాంటి తరుణంలో ఐఐటీ శాస్త్రవేత్తలు చేపట్టిన పరిశోధన ప్రాధాన్యం సంతరించుకుంది.

'ఏదైనా వైరస్​ను ఎదుర్కోవాలంటే ముందు అందులోని ప్రొటీన్ల గురించి పూర్తిగా తెలియాలి. కరోనా వైరస్​కూ ఇదే వర్తిస్తుంది. ఇందులో 16 రకాల ముఖ్యమైన ప్రొటీన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ కీలకమైనది...'ఎన్​ఎస్​పీ1'. బాధితుల శరీరంలోని కణాలను వశపరచుకుని, వాటిని వైరస్​ కేంద్రాలుగా మార్చుతున్నదీ ఈ ప్రొటీనే! దీనిపై దృష్టి సారించాం. దీనిలో కీలకమైన సి-టెర్మినల్​ రీజన్​ గుట్టును తెలుసుకున్నాం. తద్వారా.. వివిధ వాతావరణ పరిస్థితుల్లో ఈ ప్రొటీన్​ ఎలా ప్రవర్తిస్తుంది? దీని ద్వారా వైరస్​ సంక్రమణ తీవ్రత ఏ స్థాయిలో ఉంది? దీని ఆకృతి ఏంట? అన్న విషయాలు మరింత లోతుగా అర్థమవుతాయి" అని పరిశోధన కర్త రజనీశ్​ గిరి వివరించారు.

ఇదీ చదవండి: Covid cases: తమిళనాడులో తగ్గని ఉద్ధృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.