IIT Mandi Director Controversial Comments : హిమాచల్‌ప్రదేశ్‌లో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటానికి జీవహింసే కారణమంటూ ఐఐటీ మండీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. భారీ వర్షాల వల్ల పోటెత్తిన వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనలతో హిమాచల్‌ప్రదేశ్ ఇటీవల అతలాకుతలమైంది. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. అయితే, ఈ విపత్తులకు జీవహింసతో ముడిపెడుతూ స్థానిక ఐఐటీ మండీ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ప్రజలు మాంసం తింటారని.. భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటానికి జంతువులపై క్రూరత్వమే కారణమంటూ చెప్పడం వివాదాస్పదంగా మారింది. అంతటితో ఆగకుండా మాంసాహారం తినబోమని విద్యార్థులతో మండీ డైరెక్టర్ ప్రతిజ్ఞ చేయించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి.
"జంతువులను వధించడం ఆపకపోయినట్లయితే.. హిమాచల్ ప్రదేశ్‌లో పరిస్థితులు మరింత దిగజారతాయి. దానికి పర్యావరణ క్షీణతతో సంబంధం ఉంది. మేఘవిస్ఫోటాలు, స్థానికంగా కొండచరియలు విరిగిపడటం ఇవన్నీ.. జంతువులపై క్రూరత్వం ప్రభావాలే. ప్రజలు మాంసం తింటారు. అందుకే మంచి మనుషులుగా మారేందుకు మాంసాన్ని త్యజించాలి." అని ఐఐటీ మండీ డైరెక్టర్ లక్ష్మీధర్ బెహరా విద్యార్థులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
బెహరా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. తన గతంలో స్నేహితుడి అపార్ట్‌మెంట్‌లోంచి దుష్టశక్తులను పారదోలేందుకు భూతవైద్యంలో పాల్గొన్నట్లు స్వయంగా లక్ష్మీధర్ బెహరా వెల్లడించారు. ఆ సమయంలోనూ ఈయన వార్తల్లో నిలిచారు.
-
Director of an IIT. Why is Himachal having landslides? Because of unplanned construction/deforestation/climate change/all of the above? No. Because of meat-eating.
— Rahul Siddharthan (@rsidd120) September 7, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Is he saying farming animals leads to deforestation? No. He says it leads to cloudbursts.https://t.co/uudBNxWUCO
">Director of an IIT. Why is Himachal having landslides? Because of unplanned construction/deforestation/climate change/all of the above? No. Because of meat-eating.
— Rahul Siddharthan (@rsidd120) September 7, 2023
Is he saying farming animals leads to deforestation? No. He says it leads to cloudbursts.https://t.co/uudBNxWUCODirector of an IIT. Why is Himachal having landslides? Because of unplanned construction/deforestation/climate change/all of the above? No. Because of meat-eating.
— Rahul Siddharthan (@rsidd120) September 7, 2023
Is he saying farming animals leads to deforestation? No. He says it leads to cloudbursts.https://t.co/uudBNxWUCO
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Udhayanidhi Stalin Statement on Sanatana Dharma : తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, ఆ రాష్ట్ర యువజన, క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల సనాతన ధర్మాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలను బ్రాహ్మణ, హిందూ సంఘాలతోపాటు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చెన్నైలో శనివారం జరిగిన తమిళనాడు ప్రగతిశీల రచయితలు, కళాకారుల సంఘం సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి చేసిన వ్యాఖ్యలపై బ్రాహ్మణ సంఘాలు, విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా మండిపడుతున్నాయి. ఉదయనిధి స్టాలిన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్ చేయండి.