IIT Kanpur Professor On Third Wave: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగుతున్న క్రమంలో ఐఐటీ కాన్పుర్‌కు చెందిన ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్.. కీలక విషయాలను వెల్లడించారు. భారత్‌లో థర్డ్‌వేవ్ జనవరి నుంచి ఏప్రిల్(నాలుగు నెలలు)వరకు ఉంటుందన్నారు. రోజుకు లక్షా80వేల కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. ఎలక్షన్ ర్యాలీలు సూపర్ స్ప్రెడర్గా మారతాయని హెచ్చరించారు. భారీ ప్రజా సమూహాల నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను పాటించడం అంత సులువు కాదన్నారు.
"ఎన్నికల ర్యాలీల్లో భారీఎత్తున ప్రజలు పాల్గొంటారు. కొవిడ్ నిబంధనలను పాటించరు. దీనివల్ల దేశంలో కరోనా తీవ్రత పెరుగుతుంది. జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలో థర్డ్ వేవ్ జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉంటుంది. అయితే ఈసారి కరోనా సోకిన ప్రతి 10 మందిలో ఒక్కరికి మాత్రమే ఆస్పత్రి అవసరం ఉంటుంది. మార్చి చివరి నాటికి దేశంలో రెండు లక్షల పడకలు అవసరం అవుతాయి."
-- ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్, ఐఐటీ కాన్పుర్
ఆఫ్రికా, భారత్‌లో 80శాతం జనాభా 45ఏళ్ల లోపువారేనని మహీంద్ర అగర్వాల్ తెలిపారు. వీళ్లకు సాధారణ రోగనిరోధక శక్తి 80శాతం వరకు ఉంటుందన్నారు. ఇరు దేశాల్లోనూ మ్యూటెంట్ల కారణంగానే డెల్టావేరియంట్ వచ్చిందన్నారు. దక్షిణాఫ్రికాలానే భారత్‌లోనూ వేరియంట్ల ప్రభావం తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్ షురూ