ETV Bharat / bharat

ఐఐఎం హాస్టల్ భోజనంలో పురుగులు, ఇనుప తీగలు.. విద్యార్థుల ఆందోళన - కోల్​కతా ఐఐఎం విద్యార్థుల నిరసన

ఐఐఎం కోల్​కతాలోని.. క్యాంపస్ క్యాంటీన్​ భోజనంలో పురుగులు, ఇనుప తీగలు రావడం వివాదాస్పదమైంది. నాణ్యత లేని భోజనాన్ని తమకు పెడుతున్నారని విద్యార్థులు మంగళవారం ఆందోళన చేశారు. ఈ క్రమంలో క్యాంపస్​లో ఉన్న క్యాంటీన్​లన్ని మూతపడ్డాయి.

IIM Calcutta canteen serves substandard food
ఆహారం నాణ్యత లేదని విద్యార్థుల నిరసన
author img

By

Published : Nov 8, 2022, 9:54 PM IST

ఐఐఎం కోల్​కతా క్యాంపస్​లోని మెస్​లో ఆహారంలో నాణ్యత లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. క్యాంపస్‌లో ఉన్న నాలుగు క్యాంటీన్లలో ఒక క్యాంటీన్​లో ఆహారం బాగోలేదని అన్నారు. ఆహారంలో పురుగులు, ఇనుప తీగలు వస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి ఘటనలపై యజమాన్యానికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక మెస్​ను మూసేశారు సిబ్బంది. అలాగే విద్యార్థుల నిరసనలు నేపథ్యంలో మిగిలిన మూడు మెస్​లను మంగళవారం మూసేశారు. మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసినా క్యాంటీన్ సిబ్బంది వారిని క్యాంపస్‌లోకి అనుమతించడం లేదని పేర్కొన్నారు. దీనిపై మంగళవారం ఉదయం నుంచి కళాశాల క్యాంపస్‌లో ఆందోళనలు జరుగుతున్నాయి.

IIM Calcutta canteen serves substandard food
విద్యార్థుల భోజనంలో పురుగు

ఐఐఎం కోల్​కతా మెస్​లో విద్యార్థుల భోజనంలో ఇనుప తీగ

'గత రెండు నెలలుగా క్యాంపస్​లోని మెస్​లోని ఆహారం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇలా జరగడం వల్ల చాలా మంది విద్యార్థులు క్యాంటీన్​లో తినడం మానేశారు. మొబైల్ యాప్స్ ద్వారా ఫుడ్ ఆర్డర్​ చేసినా క్యాంపస్​లోకి రానివ్వట్లేదు.'
-ఐఐఎం విద్యార్థి

భోజనంలో ఇనుప తీగ
https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-kol-01-foodqualityofoneofthemessesofiimcalcuttaisbad-stills-7206406_08112022134449_0811f_1667895289_534_0811newsroom_1667907562_268.jpg
భోజనంలో చీమ

నిరనన తెలుపుతున్న విద్యార్థులు

ఇవీ చదవండి: పోలీసు ఇలాఖాలో ఆయుధాలు మాయం.. తుపాకీ బ్యారెళ్ల స్థానంలో పైపులు!

ఈ పరికరంతో బైక్​ చోరీలకు ఫుల్​స్టాప్​.. 100 కి.మీ దూరంలో ఉన్నా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.