ETV Bharat / bharat

కశ్మీరీ అందాలు కలగలిసిన 'ఇగ్లూ కేఫ్'​.. ప్రపంచంలోనే అతిపెద్దదిగా రికార్డ్​!

author img

By

Published : Feb 7, 2022, 12:44 PM IST

Updated : Feb 7, 2022, 1:04 PM IST

IGLOO CAFE: జమ్మూకశ్మీర్‌లోని ఓ ఇగ్లూ కేఫ్ సందర్శకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. చక్కని ఆతిథ్యం, కశ్మీరీ అందాలు కలగలసి పర్యటకులను కట్టిపడేస్తోంది. స్నోగ్లూ పేరిట ఏర్పాటైన ఈ ఇగ్లూ కేఫ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్‌గా నిర్వాహకులు చెబుతున్నారు.

cafe
కేఫ్
ఇగ్లూ కేఫ్​

IGLOO CAFE IN KASHMIR: జమ్మూకశ్మీర్‌ గుల్మార్గ్‌లో ఉన్న ఓ ఇగ్లూ కేఫ్ పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. స్నోగ్లూ పేరిట 37.5 అడుగుల ఎత్తు, 44.5 అడుగుల విస్థీర్ణంలో ఈ ఇగ్లూను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి కశ్మీర్ చూడటానికి వచ్చే పర్యాటకులు.. ఈ ఇగ్లూను చూడటానికి పెద్దఎత్తున తరలివస్తున్నారు.

ఈ స్నోగ్లూను రెండు భాగాలుగా విభజించారు. ఒక సెక్షన్‌లో అతిథులు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. మరో దాంట్లో మంచుతో కళాఖండాలు తీర్చిదిద్దారు. రెండు నెలల పాటు శ్రమించి ఈ స్నోగ్లూను నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు.

"ఈ కేఫ్​లో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకటి డైనింగ్​ కోసం, మరొకటి మంచుతో చేసిన కళాకృతుల కోసం ఏర్పాటు చేశాం. టేబుళ్లు, కుర్చీలే కాకుండా అలంకరణ వస్తువులనూ మంచుతోనే నిర్మించాం. టేబుళ్లపైన గొర్రెల చర్మాన్ని కవర్లగా ఏర్పాటు చేశాం. పర్యటకులు కాశ్మీరీ సంస్కృతిని ఆస్వాదించొచ్చు."

- మెహుర్​, కేఫ్​ నిర్వాహకురాలు

ఇది ప్రపంచంలోనే పెద్ద ఇగ్లూగా పేర్కొంటున్నారు నిర్వహకులు. రికార్డుకోసం దరఖాస్తు చేశామని కేఫ్​ నిర్వాహాకురాలైన మెహుర్​ తెలిపారు. స్విట్జర్లాండ్‌లోని ఓ ఇగ్లూ పేరిట ఉన్న రికార్డును స్నోగ్లూ అధిగమించినట్లు తెలిపారు. సరికొత్త కాన్సెప్ట్​తో దీనిని రెండు నెలలపాటు శ్రమించి నిర్మించామని ఆమె తెలిపారు.

స్వర్గంలో ఉన్నట్టుంది...

ఇక్కడికి వచ్చిన పర్యాటకులు సరికొత్త అనుభూతి పొందుతున్నారు. నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను చూసి హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వర్గంలో ఉన్నట్టుందని ఆనందపడుతున్నారు. కేఫ్​ అందాల్ని మాటల్లో వర్ణించలేమని, ఇటువంటి ఆలోచనకు శభాష్​ అంటూ నిర్వాహకులన్ని పర్యటకులు పొగుడుతున్నారు.

ఇదీ చదవండి: పాలపొంగులా సిమ్లా.. హిమసోయగాల్లో రైలు ప్రయాణం మధురజ్ఞాపకం!

Last Updated : Feb 7, 2022, 1:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.