ETV Bharat / bharat

'హై కమాండ్​ చెబితే సీఎంగా తప్పుకుంటా' - కర్ణాటక సీఎం మార్పు

కర్ణాటకకు కొత్త సీఎం రాబోతున్నారనే వార్తలు విస్తృతమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. హైకమాండ్​ నిర్ణయమే తన నిర్ణయమని అన్నారు. హైకమాండ్​ చెబితే ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే.. నాయకత్వ మార్పు ఉండబోదని భాజపా అధిష్ఠానం ఇప్పటికే పలుమార్లు తెలిపింది.

BS yeddyurappa
యడియూరప్ప, కర్ణాటక సీఎం
author img

By

Published : Jun 6, 2021, 1:30 PM IST

Updated : Jun 6, 2021, 4:57 PM IST

హై కమాండ్​ నిర్ణయమే తన నిర్ణయమని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప తెలిపారు. అధిష్ఠానం​ చెబితే సీఎం పదవి నుంచి వైదొలిగేందుకు క్షణం కూడా ఆలోచించనని అన్నారు.

కర్ణాటకకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారనే వార్తలు ఈ మధ్య రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారమయ్యాయి. ఈ నేపథ్యంలో యడియూరప్ప వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

"హై కమాండ్​ ఎప్పటివరకు ఉండమని చెబితే అప్పటివరకు పదవిలో కొనసాగుతా. ఒకవేళ హై కమాండ్​ సీఎంగా తప్పుకోవాలని చెబితే.. వెంటనే పదవికి రాజీనామా చేస్తా. కానీ, భాజపా అధిష్ఠానం నాపై పూర్తి నమ్మకంతో ఉంటుంది."

--యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.

పార్టీలో భిన్నాభిప్రాయలేమీ లేవని యడియూరప్ప స్పష్టం చేశారు. హైకమాండ్​ తనపై పూర్తి నమ్మకంతోనే సీఎం పదవి అప్పజెప్పిందని అన్నారు. ఇక తుది నిర్ణయం అదిష్ఠానం చేతుల్లోనే ఉందని తెలిపారు.

ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం స్పందించారు.

"యడియూరప్ప సీఎంగా తప్పుకుంటారనే ప్రశ్నే లేదు. అసలు ఈ విషయంపై ఎక్కడా చర్చలు జరగటంలేదు. పార్టీకి ఆయన ఓ సైనికుడు లాంటి వారు. అందుకే పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా దాన్ని అంగీకరిస్తా అని ఆయన చెప్పారు."

--డాక్టర్. సీఎన్ అశ్వథ్ నారాయణ్, డిప్యూటీ సీఎం.

అవకాశమే లేదు..

కర్ణాటక ముఖ్యమంత్రి తొలగింపు వార్తలపై స్పందించిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి.. యడియూరప్పను సీఎంగా తొలగించే ఉద్దేశమే భాజపాకు లేదని స్పష్టం చేశారు.

విమర్శలే కారణమా?

ఇటీవలే రాష్ట్ర మంత్రి సీపీ యోగేశ్వర్ దిల్లీకి పయనం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆయనతో పాటు ఎమ్మెల్యేలు అరవింద్ బెల్లాడ్, బసనగౌడ పాటిల్​ యత్నాల్​.. నాయకత్వ మార్పు కోసం పట్టుబడుతున్నారని తెలిసింది. కొవిడ్​ సంక్షోభాన్ని ఎదుర్కునే విషయంలో ప్రభుత్వం నిర్ణయాలపైనా కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం మార్పు తప్పకుండా ఉంటుందనే వార్తలకు మరింత బలం చేకూరింది.

అయితే.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కతీల్, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ ఈ ఆరోపణలను తిప్పికొట్టారు. యడియూరప్ప పదవీకాలం ముగిసేంతవరకు సీఎంగా ఉంటారని అన్నారు.

ఇదీ చదవండి:

Yediyurappa: నా దృష్టంతా ఆ విషయంపైనే

సీఎం మార్పు తప్పదా- పగ్గాలు ఎవరి చేతికి?

Last Updated : Jun 6, 2021, 4:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.