ETV Bharat / bharat

టీకాలు డెల్టాప్లస్​ వేరియంట్​ను అడ్డుకోలేవా? - భారత వైద్య పరిశోధన మండలి

దేశంలో కొన్ని రాష్ట్రాల్లో డెల్డాప్లస్ వేరియంట్​​ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్​లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలతో ఈ వేరియంట్ కట్టడికి వీలవుతుందా? అనే కోణంలో​ భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​), నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ(ఎన్​ఐవీ) పరిశోధన ప్రారంభించాయి.

ICMR
ఐసీఎంఆర్​
author img

By

Published : Jun 25, 2021, 11:21 AM IST

దేశంలో కరోనా రెండోదశ తగ్గుముఖం పడుతున్న తరుణంలో.. మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్​ రాష్ట్రాల్లో డెల్టాప్లస్​ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రమాదకరంగా భావిస్తున్న ఈ కొత్త వేరియంట్​పై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్​), నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ వైరాలజీ(ఎన్​ఐవీ) పరిశోధనలు ప్రారంభించాయి. దేశ పౌరులకు పంపీణీ చేస్తున్న కొవాగ్జిన్, కొవిషీల్డ్​ టీకాలు.. కొత్త కొవిడ్ వేరియంట్​ను ఎంత సమర్థంగా అడ్డుకుంటాయన్న అంశంపై పరిశోధకులు దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుత టీకాలు 'డెల్టా ప్లస్​' వేరియంట్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తున్నాయా? అనే దానిపై పరిశోధనలు జరుగుతున్నాయని ఎన్‌ఐవీ తెలిపింది.

ICMR
ఐసీఎంఆర్​

"టీకాలు వేసిన పౌరులలో యాంటీబాడీలపై నిశితంగా అధ్యయనం చేస్తున్నాం. రానున్న కొన్నివారాల్లో డెల్టా వేరియంట్​ అధ్యయన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం. భారత్​లో తొలిసారిగా బయటపడిన డెల్టా వేరియంట్​ నుంచి డెల్టాప్లస్​గా కరోనా రూపాంతరం చెందింది. ఇందులో కె417ఎన్​ అని పిలుస్తున్న స్పైక్ ప్రొటీన్​ మ్యుటేషన్ ఉంటుంది. మహారాష్ట్రలో గత కొద్ది రోజుల్లో పరీక్షించిన 7,900 మందిలో, 21 మందికి కొత్త వేరియంట్​ నిర్ధరణ అయింది" అని ఎన్​ఐవీ వెల్లడించింది.

ఇదీ చూడండి: 'ప్రజాస్వామ్యంపై ఉక్కుపాదం.. అత్యవసర పరిస్థితి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.