IBPS Calendar 2024 : ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) 2024 సంవత్సరంలో నిర్వహించనున్న వివిధ పరీక్షల (Tentative Calendar) క్యాలెండర్‌ను విడుదల చేసింది. ముఖ్యంగా క్లర్క్, ప్రొబేషనరీ ఆఫీసర్, స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షల తేదీలను ఐబీపీఎస్ ప్రకటించింది. వీటితోపాటు రీజనల్ రూరల్ బ్యాంక్ (RRB)లకు సంబంధించిన ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. వాటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
IBPS RRB Exam Dates : ఐబీపీఎస్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ (స్కేల్-1) పోస్టుల భర్తీ కోసం షెడ్యూల్ ఖరారు చేసింది. వీటి పరీక్ష తేదీలు ఎప్పుడంటే?
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2024 ఆగస్టు 3, 4, 10, 17, 18
- సింగిల్ ఎగ్జామ్ తేదీ : 2024 సెప్టెంబర్ 29
- మెయిన్ ఎగ్జామ్ తేదీ :
ఆఫీసర్ స్కేల్ 1 | 2024 సెప్టెంబర్ 29 |
ఆఫీస్ అసిస్టెంట్ | 2024 అక్టోబర్ 6 |
IBPS Clerk And PO Exam Dates : పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లోని క్లర్క్, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్షల తేదీలను కూడా ఐబీపీఎస్ విడుదల చేసింది. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
క్లర్క్ పరీక్ష తేదీలు
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2024 ఆగస్టు 24, 25, 31
- మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ : 2024 అక్టోబర్ 13
ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పరీక్ష తేదీలు
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2024 అక్టోబర్ 19
- మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ : 2024 అక్టోబర్ 20
స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పరీక్ష తేదీలు
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు : 2024 నవంబర్ 9
- మెయిన్ ఎగ్జామినేషన్ తేదీ : 2024 డిసెంబర్ 14
ఐబీపీఎస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్
ఆసక్తిగల అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ https://ibps.in/ ఓపెన్ చేసి, అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ఐబీపీఎస్ రిజిస్ట్రేషన్‌ను కేవలం ఆన్లైన్ మోడ్‌లో మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లోడ్ చేయాల్సిన పత్రాల వివరాలు
- అభ్యర్థి ఫొటోగ్రాఫ్ : ఇది 20kb - 50kb సైజ్‌లో .jpeg ఫైల్ ఫార్మాట్ ఉండాలి.
- అభ్యర్థి సంతకం : ఇది 10kb - 20kb సైజ్‌లో .jpeg ఫైల్ ఫార్మాట్ ఉండాలి.
- థంబ్ ఇంప్రెషన్ : అభ్యర్థి బొటనవేలు ముద్ర 20kb - 50kb సైజ్‌లో .jpeg ఫైల్ ఫార్మాట్ ఉండాలి.
- అభ్యర్థులు నిర్దేశిత ఫార్మాట్ ప్రకారం, చేతితో డిక్లరేషన్ రాయాలి. దానిని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఇది 50kb - 100kb సైజ్‌లో .jpeg ఫైల్ ఫార్మాట్ ఉండాలి. (ఐబీపీఎస్ విడుదల చేసే నోటిఫికేషన్లో ఈ డిక్లరేషన్ ఫార్మాట్ ఉంటుంది.)
నోట్ : ఈ పరీక్ష తేదీలను, మార్గదర్శకాలను, నియామక ప్రక్రియలను మార్చే హక్కు ఐబీపీఎస్‌కు ఉంటుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి.
సరిగ్గా ప్రిపేర్ అయితే విజయం గ్యారెంటీ
ఐబీపీఎస్ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సరిపడా సమయం ఉంది. కనుక, అభ్యర్థులు ఇప్పటి నుంచే ఒక సరైన ప్రణాళిక ప్రకారం చదివితే, కచ్చితంగా విజయం సాధించడానికి వీలవుతుంది. ఆల్ ది బెస్ట్!
స్పోర్ట్స్ కోటాలో 169 CRPF కానిస్టేబుల్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!
ఐటీఐ, డిప్లొమా అర్హతతో AAIలో 130 పోస్టులు - అప్లై చేసుకోండిలా!