ETV Bharat / bharat

ఐఏఎస్​ అధికారుల జీతం ఎంతో తెలుసా? ఆ 7 బెనిఫిట్స్​ కూడా! - కలెక్టరు నివాసం

IAS Officer Salary : ఐఏఎస్​ అధికారులకు జీతమెంతో తెలుసుకోవాలని ఉందా? వారికి ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే అన్ని వివరాలు ఉన్న ఈ ఆర్టికల్​ చదివేయండి మరి.

కలెక్టురు జీతాలు వారి హోదాలు ఏంటో మీకు తెలుసా
ias-officer-salary-per-month
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2023, 8:01 AM IST

IAS Officer Salary : మన దేశంలో అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఐఏఎస్​ ఒకటి. ఆ ఉద్యోగం సాధించాలని ఎంతోమంది ప్రయత్నించినా.. కొందరు మాత్రమే సాధిస్తారు. అయితే ఐఏఎస్​ ఉద్యోగం సాధించాలంటే ముందుకు UPSC పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. ఒక్కసారి UPSC పరీక్షలో విజయం సాదిస్తే జీవితంలో వెనుదిగి చూడాల్సిన అవసరం ఉండదు.

మొదట డిప్యూటీ కలెక్టర్​ హోదాలో పనిచేసి.. ఆ తర్వాత కొన్నేళ్లపాటు జిల్లా కలెక్టర్​గా విధులు నిర్వర్తిస్తారు. అనంతరం రాష్ట్ర పరిపాలన విభాగానికి డివిజినల్​ కమిషనర్​గా పదోన్నతి పొందవచ్చు. కొన్నిసార్లు అంతర్జాతీయ వేదికలపై దేశం తరఫున ప్రాతినిథ్యం వహించవచ్చు. అయితే ఐఏఎస్​ అధికారులకు జీతమెంత? ఇతర సౌకర్యాలేంటి?

జీతభత్యాలు
ఐఏఎస్​ అధికారులు వారి హోదాను బట్టి జీతభత్యాలు పొందుతారు. వారి ప్రారంభ వేతనం రూ.50000గా ఉంటుంది. సీనియారిటీ బట్టి రూ.1,50,000 వరకు అందుకుంటారు. పనిచేస్తున్న విభాగాల ఆధారంగా రూ.250000 కూడా తీసుకుంటారు. ప్రాథమిక వేతనంతో పాటు, IAS అధికారులు డియర్‌నెస్ అలవెన్స్ (DA), ఇంటి అద్దె అలవెన్స్ (HRA), ట్రావెల్ అలవెన్స్ (TA) ఇతర ప్రత్యేక అలవెన్స్‌లు కూడా పొందుతారు. IAS అధికారి వాస్తవ జీతం, పోస్టింగ్ చేసే నగరం, రాష్ట్రం, అలాగే వారి పని తీరుపై ఆధారపడి ఉంటుంది.

ఐఏఎస్​ అధికారులు అనేక ఇతర ప్రయోజనాలను పొందుతారు. అవేంటంటే?

  • నివాస భవనం: ఐఏఎస్​ అధికారులకు వారి ర్యాంక్​, సీనియారిటీ, పే స్కేల్​ను బట్టి నివాసం ఉండేందుకు బంగ్లా లేదా ఇల్లును కేటాయిస్తారు.
  • రవాణా సదుపాయం : హోదాను బట్టి ఐఏఎస్​ అధికారులకు ప్రభుత్వమే రవాణా సదుపాయాన్ని కల్పిస్తుంది.
  • భద్రత : ఐఏఎస్​ అధికారులు.. సాధారణ పౌరులలానే గన్​ లైసెన్స్​ పొందవచ్చు. ముగ్గురు హోం గార్డులతోపాటు ఇద్దరు అంగరక్షకులను ప్రభుత్వం నియమిస్తుంది.
  • మౌలిక సదుపాయాలు : ఐఏఎస్​ అధికారులకు ఉచితంగానే నీరు, విద్యుత్, గ్యాస్​, ఫోన్​ వంటి సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది.
  • వసతి : అధికారిక లేదా అనధికార పర్యటనల సమయంలో ఐఏఎస్​ అధికారులు.. ప్రభుత్వ అతిథి గృహాలు లేదా బంగ్లాలలో సబ్సిడీతో వసతి పొందవచ్చు.
  • సెలవులు : ఏడేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఐఏఎస్​ అధికారులు.. రెండేళ్ల పాటు స్టడీ లీవ్​లు పొందవచ్చు. విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు వెళ్లవచ్చు. అందుకయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది.
  • పెన్షన్​ : పదవీ విరమణ పొందిన తర్వాత ఐఏఎస్​ అధికారులు.. జీవిత కాల పెన్షన్ పొందుతారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.