ETV Bharat / bharat

ఆ వ్యాపారులే లక్ష్యంగా ఐటీ దాడులు- ఎస్పీ నేత నివాసంలోనూ.. - పియూష్​ జైన్ ఐటీ రైడ్స్​

I-T Raids On Perfume Traders: ఉత్తర్​ప్రదేశ్​ సహా మరికొన్ని ప్రాంతాల్లోని పర్ఫ్యూమ్ వ్యాపారుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కాన్పుర్, కన్నౌజ్​, దిల్లీలతో పాటు ఇతర ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

income tax rides
ఐటీశాఖ సోదాలు
author img

By

Published : Dec 31, 2021, 11:14 AM IST

I-T Raids On Perfume Traders: దేశ వ్యాప్తంగా ఉండే పర్ఫ్యూమ్ వ్యాపారుల ఇళ్లలో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పన్ను ఎగవేత విచారణలో భాగంగా ఈ దాడులు చేస్తున్నట్లు ఐటీ శాఖ అధికారులు తెలిపారు. కాన్పూర్, కన్నౌజ్, ముంబయి, సురత్​, దిల్లీలతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా సోదాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

పర్ఫ్యూమ్ వ్యాపారుల ఇళ్లతో పాటు వారికి సంబంధించిన మరికొన్ని సంస్థల్లో కూడా ఐటీ శాఖ అధికారులు సోదాలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే కచ్చితంగా ఎవరిపై ఈ దాడులు జరుగుతున్నాయి అనే విషయాన్ని అధికారులు ఎవరూ బహిర్గతం చేయలేదు.

సమాజ్​వాదీ పార్టీ ఎంఎల్​సీ అయిన పుష్పరాజ్​ అలియాస్​ పంపి జైన్​కు చెందిన కన్నౌజ్​లోని ఆయన నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు ఆ పార్టీ అధికారిక ట్విట్టర్​ పేజ్​లో షేర్​ చేసింది. ఎస్​పీ అధినేత అఖిలేశ్​ యాదవ్​.. కన్నౌజ్​లో మీడియా సమావేశానికి పిలుపునిచ్చిన సందర్భంగా భాజపా ప్రభుత్వం ఐటీ రైడ్స్​కు తెర తీసిందని పేర్కొంది.

వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇటీవల సమాజ్​వాదీ పేరుతో పుష్పరాజ్​ ఓ పర్ఫ్యూమ్​ను విడుదల చేశారు.

Piyush jain kanpur raid

పియూష్​ జైన్ ఐటీ రైడ్స్​..

ఇటీవల జీఎస్​టీ ఎగవేత కేసులో ఉత్తర్​ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన వ్యాపారి పీయూష్‌ జైన్‌కు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు నిర్వాహించారు. కన్నౌజ్​లోని ఆడ్​కెమ్​ ఇండస్ట్రీస్​కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో నుంచి.. ఇప్పటివరకు తాము రూ.197 కోట్ల నగదు, 26 కిలోల బంగారం, 600 కిలోల చందనం నూనెను స్వాధీనం చేసుకున్నామని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్​ జీఎస్​టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: పాపం.. ప్రాణాలు తీసిన నకిలీ బ్యాంక్​ అకౌంట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.