తమిళనాడుకు చెందిన ప్రభుత్వ కాంట్రాక్ట్ నిర్వహణ సంస్థ కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో మొత్తం రూ.700 కోట్ల నల్లధనం బయటపడినట్టు ఐటీ అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా లెక్కలు చూపని రూ. 21కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.
ప్రభుత్వ కాంట్రాక్ట్‌కు సంబంధించి సివిల్ వర్క్స్, సముద్ర తీరప్రాంతాల్లో వేవ్ బ్రేకర్లను నిర్మిస్తోన్న ఈ కంపెనీ.. బస్సు రవాణా, మ్యారేజ్ హాల్, ఫుడ్ మాసాలా వ్యాపారాలను నడుపుతోంది. ఈ సంస్థపై ఈ నెల 14, 15 తేదీల్లో ఈరోడ్, చెన్నై ప్రాంతాలలో ఈ సోదాలు నిర్వహించింది ఐటీ శాఖ. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని రూ.700 కోట్ల ఆదాయాన్ని గుర్తించింది. ఈ సొమ్ముతో రియల్ ఎస్టేట్ విభాగం, ఇతర వ్యాపార రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు గుర్తించారు అధికారులు.
ఇదీ చదవండి: 'సెక్యూరిటీ గార్డులకు ప్రత్యేక శిక్షణ తప్పనిసరి'