కుటుంబ సభ్యులకు కరోనా సోకుతుందేమోనని ఓ విశ్రాంత డిప్యూటీ తహసీల్దార్ తుపాకీతో తనను తాను కాల్చుకుని చనిపోయాడు. కర్ణాటక చిక్కమగళూరులోని బెలెనహళ్లి గ్రామానికి చెందిన సోమనాయక్కు.. కొద్దిరోజుల క్రితం కరోనా వచ్చింది. దీంతో సూసైడ్ నోట్ రాసి కారులోనే బలన్మరణానికి పాల్పడ్డాడు. తన కుటుంబానికి కరోనా అంటుకుంటుందేమోనన్న భయంతోనే తనువు చాలిస్తున్నట్లు నోట్లో పేర్కొన్నాడు.
మరోవైపు, చామరాజనగర్ జిల్లా కొల్లెగల్ తాలుకాలో సైతం ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది. ఇక్కడహళ్లి గ్రామానికి చెందిన 70ఏళ్ల సిద్ధమ్మకు మే 1న కొవిడ్ సోకింది. వైద్యుల సిఫార్సు మేరకు ఆ వృద్ధురాలు హోంక్వారంటైన్లో ఉంది. అయితే, ఇంట్లోని చిన్నపిల్లలకు తన నుంచి కరోనా సోకుతుందన్న భయంతో మే 3న ఉరేసుకుని చనిపోయింది.
ఇదీ చదవండి: ఆంక్షల వేళ.. అంతిమ యాత్రకు పోటెత్తిన జనం