న్యాయవ్యవస్థ, పార్లమెంట్‌లో మహిళల రిజర్వేషన్లకు తాను పూర్తి మద్దతు ఇస్తానని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ వెల్లడించారు. తమిళనాడులో పర్యటిస్తున్న రాహుల్..న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఏ రంగంలోనూ వివక్ష ఆమోదయోగ్యం కాదన్నారు. పురుషులు తమను తాము ఎలా చూస్తారో మహిళలను అలాగే చూడాలని రాహుల్ సూచించారు. దేశంలోని వ్యవస్థలను ఆర్‌ఎస్‌ఎస్ నాశనం చేసిందన్న రాహుల్ దేశంలో ప్రజాస్వామం మనుగడ సాగించే పరిస్థితులు లేవన్నారు.
"దేశం, వ్యవస్థల మధ్య సమతుల్యత ఉంటుంది. ఒకసారి ఆ సమతుల్యతకు భంగం కలిగితే దేశానికి కూడా భంగం వాటిల్లుతుంది. లోక్‌సభ, విధానసభ, పంచాయతీలు, న్యాయ వ్యవస్థ, స్వేచ్ఛాయుత మీడియా ఈ వ్యవస్థలన్నీ కలిసి దేశాన్ని సమతుల్యంగా ఉండేలా చూస్తాయి. కానీ గత ఆరేళ్లుగా మనం ఏం చూస్తున్నాం. ఈ వ్యవస్థన్నింటిపై క్రమబద్ధమైన దాడి జరుగుతోంది."
రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
దేశంలో ప్రజాస్వామ్యం మరణించిందని రాహుల్ అన్నారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించే పరిస్థితి లేదని, ప్రజాస్వామం మరణించడానికి కారణం ఆర్‌ఎస్‌ఎస్ అని ఆరోపించారు. వ్యవస్థల మధ్య సమతుల్యతను ఆర్‌ఎస్‌ఎస్ నాశనం చేసింది.
ఇవీ చదవండి: