బంగాల్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి బ్రిగేడ్ పరేడ్ మైదానంలో ర్యాలీకి హాజరయ్యారు. ఈ సభలోనే ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఆ పార్టీలో చేరారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన.. తృణమూల్‌పై విరుచుకుపడ్డారు. తానోక కింగ్ కోబ్రా అని... అధికార పార్టీని ఒకే దెబ్బకు అంతం చేస్తానని అన్నారు. తన బెంగాలీ చిత్రాల్లో ప్రేక్షకాదరణ పొందిన సంభాషణలను ఉటంకిస్తూ.. 'బ్రిగేడ్ మైదానం ఉల్లాసంగా ఉంది. . ఏక్ చోబోలే చోబీ' అనే కొత్త నినాదాన్ని గుర్తుంచుకోండి అని అన్నారు.
రెండు సార్లు తృణమూల్ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్న మిథున్.. ఆ పార్టీకి రాజీనామా చేసి కమల దళంతో జత కట్టారు. నరేంద్ర మోదీ హజరైన ఈ ర్యాలీకి భాజపా ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ, పార్టీ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, సువేందు అధికారి కూడా పాల్గొన్నారు.