ETV Bharat / bharat

Hyderabad Rowdy Sheeter Muder Case Update : అందమైన అబ్బాయిని ఎర వేసి.. రౌడీ షీటర్​ హత్య..! - సైదాబాద్ హత్య కేసు అప్​డేట్

Hyderabad Rowdy Sheeter Muder Case Update : స్థానిక సమస్యలను ఎత్తిచూపుతూ ఇబ్బంది పెడుతున్నాడనే కోపం.. ఎన్నిసార్లు మందలించినా మాట వినడం లేదనే ఆక్రోశంతో తమ పేరు బయటపడకుండా పక్కా పథకం వేశారు. అతడి స్వలింగ సంపర్కం అలవాటును ఆయుధంగా మలచుకొని సుపారీ ఇచ్చి హత్య చేయించారు. ఈనెల 10న సంచలనం సృష్టించిన చాంద్రాయణగుట్ట రౌడీషీటర్‌ షేక్‌ సయీద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ బావజీర్‌ హత్య కేసులో నలుగురు నిందితులను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Saidabad Muder Case
Saidabad Saeed Bawazeer Muder Case
author img

By

Published : Aug 17, 2023, 11:03 AM IST

Updated : Aug 17, 2023, 11:27 AM IST

Hyderabad Rowdy Sheeter Muder Case Update : చాంద్రాయణగుట్ట బార్కస్‌ ప్రాంతానికి చెందిన షేక్‌ సయీద్‌ బిన్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ బావజీర్‌ అలియాస్‌ సయీద్‌ బావజీర్‌ అవివాహితుడు. ఇతడిపై హైదరాబాద్, రాచకొండ పరిధిలో 11 పోలీసు కేసులున్నాయి. దీంతో చాంద్రాయణగుట్ట పోలీసులు ఇతడిపై రౌడీషీట్‌ తెరిచారు. చిన్నపిల్లలపై లైంగిక దాడులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేస్తుండటంతో 2018లో పీడీయాక్ట్‌ ప్రయోగించారు.

Rowdy Sheeter Saeed Bawajeer Murder case : మరో వ్యక్తి సుల్తాన్‌షాహి ప్రాంతానికి చెందిన అహ్మద్‌ బిన్‌ హజీబ్‌పై హైదరాబాద్, సైబరాబాద్‌ పరిధిలో 6 కేసులున్నాయి. భవానీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీటర్‌ తెరిచారు. 2021లో పోక్సో కేసులో సయీద్‌ బావజీర్‌ చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నపుడు అహ్మద్‌ బిన్‌ హజీబ్‌ పరిచమయ్యాడు. జైలు నుంచి విడుదలయ్యాక స్నేహం మరింత బలపడింది. సయీద్‌ బావజీర్‌ స్వలింగ సంపర్కం అలవాటు ఉండటంతో హజీబ్‌ అసహజ శృంగారంతో దగ్గరవుతుండేవారు. దీన్ని అవకాశం చేసుకొని తన కోసం అతడి స్నేహితులను అసహజ శృంగారానికి ఒప్పించమంటూ హజీబ్‌పై ఒత్తిడి పెంచాడు.

Saidabad Muder Case
మున్సిపల్‌ ఛైర్మన్‌ అబ్దుల్లా సాది (నిందితుల్లో ఒకరు)

ఈ ఒత్తిడి భరించలేక మొగల్‌పుర ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అయూఖాన్‌ను హజీబ్‌ బావజీర్ వద్దకు తీసుకెళ్లాడు. అతడు తిరస్కరించినపుడు జరిగిన గొడవతో సయీద్‌ బావజీర్‌ గుట్టు వెలుగుచూసింది. ఇతడు జల్‌పల్లి పురపాలక సంఘం పరిధిలోని స్థానిక సమస్యలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలపై వీడియోలు, ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుండేవాడు. తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ప్రజల్లో తమను చులకన చేస్తున్నాడని జల్‌పల్లి మున్సిపల్‌ ఛైర్మన్‌ అహ్మద్‌సాది, అతడి తండ్రి అబ్దుల్లాసాదిలు సయూర్ బావజీర్​పై కక్ష పెంచుకున్నారు. పలుమార్లు హెచ్చరించినా మారకపోవటంతో ఎలాగైనా అడ్డుతొలగించాలనే పథకం వేశారు. గతంలో రెండుసార్లు సుపారీ ముఠాతో హత్య చేయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.

FRO Srinivasa Rao Murder Case : ఎఫ్‌ఆర్‌వో శ్రీనివాసరావు హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు

పేరు బయటకి రాకుండా హత్యకు రూ.13 లక్షలకు ఒప్పందం : ఇదే క్రమంలో రౌడీషీటర్‌ సయీద్‌ బావజీర్‌ స్వలింగ సంపర్కుడనే విషయం అహ్మద్‌ సాది, అతడి తండ్రి అబ్దుల్లా సాదిలకు తెలిసింది. దాన్నే ఆయుధంగా ప్రయోగించి హత్యకు ప్రణాళిక సిద్ధం చేశారు. గత నెల చివర్లో హజీబ్‌తో చర్చించారు. హత్యకు రూ.13 లక్షలకు సుపారీ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ పేరు బయట పడకుండా చూడాలని కోరారు. అసహజ శృంగార సమయంలో తలెత్తిన గొడవతో జరిగిన హత్యగా చిత్రీకరించాలని, పోలీసులనూ నమ్మించాలని నిర్ణయానికి వచ్చారు.

ఈ నెల 6న తొలిసారి రౌడీషీటర్‌ హత్యకు సిద్ధమయ్యారు. అందమైన అబ్బాయిని తీసుకొచ్చానంటూ నిర్మానుష్య ప్రాంతానికి రప్పించారు. అక్కడ పథకం బెడసికొట్టడంతో మరోసారి అమలు చేసేందుకు సిద్ధపడ్డారు. బండ్లగూడ రాయల్‌సీ హోటల్‌ సమీపంలోని భవనంలోని గదిలో రౌడీషీటర్‌ సయీద్‌ అద్దెకు ఉంటుండగా.. అక్కడే అతడిని హతమార్చేందుకు హజీబ్‌ ముఠా సిద్ధమైంది.

అసహజ శృంగారంలో ఉండగా.. కళ్లల్లో కారంకొట్టి కత్తితో దాడి : ఈ నెల 9న హజీబ్‌ ఫోన్‌ చేసి తాను ఒక యువకుడిని తీసుకొస్తున్నానని, అతడితో ఆనందాన్ని ఆస్వాదించవచ్చంటూ చెప్పాడు. ఈ నెల 10న అర్ధరాత్రి సౌద్‌ అనే యువకుడిని తీసుకొని రెండు ద్విచక్రవాహనాలపై నలుగురు కలసి రౌడీ షీటర్‌ కార్యాలయం వద్దకు చేరారు. ఇద్దరు బయట ఉండగా సౌద్, హజీబ్‌ ముందుగా సిద్ధం చేసుకున్న కత్తి, కారంపొడితో లోపలికి వెళ్లారు. సౌద్‌ను సయీద్‌ గదిలోకి పంపి హజీబ్ బయటకు వచ్చాడు.

ఇద్దరూ అసహజ శృంగారంలో ఉండగా గదిలోకి ప్రవేశించిన హజీబ్.. ఏమరపాటుగా ఉన్న సయీద్ కళ్లల్లో కారంకొట్టి కత్తితో దాడి చేశాడు. చనిపోయినట్టు నిర్దారించుకున్నాక నలుగురు బైక్‌లపై పారిపోయారు. కేసు నమోదు చేసిన బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యలో ఆరుగురి ప్రమేయం ఉన్నట్టు నిర్దారించారు. అహ్మద్‌ బిన్‌ హజీబ్, అహ్మద్‌సాది, అబ్దుల్లా సాది, మహ్మద్‌ అయూబ్‌ఖాన్‌లను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సలేహ్‌సాది, ఓమర్‌సాది కోసం గాలిస్తున్నారు.

Shamshabad Woman Murder Case Update : శంషాబాద్ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ.. కంట్లో కారం కొట్టి చీర కొంగుతో ఉరి

Shamshabad Woman Murder Case Update : మహిళను చంపి కాల్చేసిన ఘటన.. పోలీసుల అదుపులో ఇద్దరు అనుమానితులు

Last Updated : Aug 17, 2023, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.