Hyderabad Child abuse: చిన్నారిపై ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. యువకుడు ఓ బాలుడిని చిత్ర హింసలు పెట్టడం వీడియోలో కనిపిస్తోంది. ఓ వ్యక్తి బాలుడిని హింసిస్తుంటే మరొకరు వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. దృశ్యాల్లో కనిపిస్తున్న వ్యక్తి.. బాలుడిని తలకిందులుగా వేలాడదీసి పూరీ కర్రతో కొట్టాడు. కిందపడేసి ఛాతిపై కాలితో తొక్కాడు. మెడకు బరువులు తగిలించి గుంజీలు తీయించాడు.
Bengal man Child abuse: యువకులు ఇద్దరూ అసభ్య పదజాలం ఉపయోగిస్తూ బాలుడిని దూషించారు. హైదరాబాద్లోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటన తాలూకు దృశ్యాలు బంగాల్లో వైరల్ అయ్యాయి. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి బంగాల్లోని బమన్గోలా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించేవాడని తెలుస్తోంది. అతడి పేరు ప్రొసెన్జిత్ మండల్ అని అక్కడి స్థానికులు చెబుతున్నారు. అతడి స్వస్థలం నందినదాహ గ్రామమని వెల్లడించారు.
ఆ గ్రామంలోని అతడి ఇంట్లో ఇప్పుడు ఎవరూ ఉండటం లేదని తెలిపారు. ప్రొసెన్జిత్ సోదరులు విదేశాల్లో పనిచేసుకుంటున్నారని వెల్లడించారు. ప్రొసెన్జిత్ ప్రస్తుతం తెలంగాణలోని హైదరాబాద్లో ఉంటున్నాడని స్థానికులు చెప్పారు. అయితే, వీడియోలో ఆ వ్యక్తి చిత్ర హింసలు పెడుతున్న బాలుడిని ఎవరూ గుర్తించలేదు. అతడు ఎవరో తెలియదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: బాలికపై సామూహిక అత్యాచారం.. మనస్తాపంతో ఉరి వేసుకుని ఆత్మహత్య