ETV Bharat / bharat

నువ్వు చస్తే మొదటి పెళ్లాం దగ్గరికెళ్తా - కళ్లెదుటే భార్య ఉరేసుకుంటుంటే వీడియో తీసిన భర్త - హైదరాబాద్ క్రైమ్ న్యూస్

Husband Recorded Wife's Suicide Video in Hyderabad : అతనికి ముందుగానే పెళ్లి అయింది. అయినా సరే మరో యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లు బాగానే సాగింది వారి జీవితం. కొంతకాలంగా మద్యానికి బానిసైన అతను తరచూ రెండో భార్యను వేధించసాగాడు. ఆ వేధింపులు తట్టుకోలేని భార్య ఉరి వేసుకుంటుంటే ఆపాల్సింది పోయి నేనెప్పుడు చావును చూడలేదంటూ వెకిలి నవ్వులు నవ్వుతూ భార్య ఆత్మహత్యను వీడియో తీస్తూ పైశాచిక ఆనందం పొందాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్​లోని ఆసిఫ్​నగర్ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Husband Recorded Wife Suicide Video in Hyderabad
Husband Recorded Wife Suicide Video
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 14, 2023, 9:22 AM IST

Husband Recorded Wife's Suicide Video in Hyderabad : ఆ వ్యక్తి రోజూ మద్యం తాగొచ్చి భార్యను చిత్రహింసకు గురి చేసేవాడు. అతడి వేధింపులు ఆమె తట్టుకోలేకపోయింది. దీనికి కారణం అతడు మద్యానికి బానిసవ్వడమేనని అందుకే మద్యం మానేయమని ఎన్నోసార్లు భర్తను వేడుకుంది. అయినా సరే అతడు మానలేదు. పైగా ఇంకాస్త ఎక్కువగా తాగి వచ్చి మరింత వేధించడం మొదలుపెట్టాడు. ఆ నరకం తట్టుకోలేకపోయిన ఆమె చనిపోవాలని నిశ్చయించుకుంది. భర్త కళ్లెదుటే ఉండగా, 'నువ్వు మందు తాగడం మానకపోతే నేను చనిపోతానంటూ' బెదిరిస్తూ ఉరి వేసుకోబోయింది.

అది చూసిన భర్త ఆమెను ఆపాల్సింది పోయి 'నేను చావు ఎప్పుడూ చూడలేదు. నువ్వు చచ్చిపో ఇప్పుడు చూస్తానంటూ' వెకిలి నవ్వు నవ్వాడు. అది చూసి తనకు చావే నయమని భావించిన ఆమె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదంతా కళ్లారా చూస్తూ పైశాచికంగా మొబైల్ ఫోన్​లో వీడియో తీశాడు ఆ ఉన్మాది. ఆ తర్వాత తన బావమరిదికి ఫోన్ చేసి నీ చెల్లి చచ్చిపోయింది వచ్చి శవం తీసుకుపో అని చెప్పాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్​ నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. భార్య మరణించి, కన్నబిడ్డలు ఏడుస్తున్నా చలించని నిందితుడిని చూసి పోలీసులే విస్మయం చెందారు. నిందితుడిని ఆదుపులోకి తీసుకున్నారు.

Husband Suicide Selfi Video Viral : భార్య విడిచి వెళ్లిపోయిందని.. భర్త ఆత్మహత్య.. వీడియో వైరల్​

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి సయ్యద్‌ అలీగూడ (రవీంద్రనగర్‌)కు చెందిన షేక్‌ రసూల్‌ (39)కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య ఉండగానే రెండో పెళ్లి చేసుకున్నాడు. మొదటి భార్యకు నలుగురు సంతానం ఉన్నారు. అలాగే నాలుగేళ్ల క్రితం అర్షాబేగం(22)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. రసూల్ కార్పెంటర్‌గా పనిచేస్తూ రెండు కుటుంబాలనూ పోషిస్తున్నాడు. కొన్నాళ్ల పాటు బాగానే సాగింది వారి జీవింతం. అయితే రసూల్ కొంతకాలంగా మద్యానికి బానిసై తరచూ రెండో భార్యను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు.

ఇంట్లో డబ్బులు ఇవ్వకపోవడం, పిల్లలు పస్తులుండాల్సిన పరిస్థితుల్లో వారి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ నెల 11న కూడా రసూల్ అర్ధరాత్రి తాగొచ్చి అర్షాబేగం దగ్గరకు వచ్చాడు. తాగొచ్చిన భర్తతో ఆమె గొడవపడింది. ఇకనుంచి మద్యం మానేయకుంటే ఉరేసుకొని చస్తానని బెదిరించింది. అప్పటికే మద్యం మత్తు తలకెక్కన అతను ఉన్మాదిగా మారాడు. నువ్వు చస్తే, పెద్దభార్య దగ్గరకెళతానంటూ భార్యతో ఎగతాళి చేశాడు. ఆమె చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకునేప్పుడు కూడా ఆపే ప్రయత్నం చేయకుండా, నవ్వుతూ సెల్‌ఫోన్‌తో వీడియో తీశాడు.

ఇప్పటి వరకూ చావును ప్రత్యక్షంగా చూడలేదని, 'నువ్వు ఉరేసుకుంటే చూస్తా'నంటూ పైశాచికంగా ప్రవర్తించాడు. అలా భార్య ఉరి వేసుకొని వేలాడుతున్న దృశ్యాలను తన ఫోన్​లో వీడియో తీశాడు. ఆమె మృతి చెందినట్టు నిర్ధారించుకున్నాక బావమరిదికి ఫోన్‌ చేసి అర్షాబేగం ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన స్థానికులు, డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు రసూల్‌ను అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Husband Killed Wife in Hyderabad Today : నాగోల్​లో దారుణం.. భార్యను కత్తితో పొడిచి హత్య.. ఆపై భవనం నుంచి దూకి భర్త ఆత్మహత్య

Woman Suicide In Amberpet : 'నువ్వు లేక నేను లేను' అంటూ భర్త చెంతకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.