ETV Bharat / bharat

భార్య జననాంగాల్లో మేకులు దించిన భర్త! - ఉత్తర్​ప్రదేశ్​లో భార్య రహస్య భాగాల్లోకి మేకులు

భార్యతో గొడవపడి అత్యంత పాశవికంగా ప్రవర్తించాడు భర్త. మహిళ జననాంగాల్లోకి మేకులను దించాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాధితురాలిని బెదిరించాడు. అయితే, మహిళ మాత్రం పోలీసులను ఆశ్రయించింది.

husband-makes-nails-in-private-part-of-wife-at-rampur
మహిళ రహస్య భాగాల్లోకి మేకులు
author img

By

Published : Jun 1, 2021, 11:53 AM IST

కట్టుకున్న భార్యపై క్రూరంగా ప్రవర్తించాడో భర్త. చిత్రహింసలకు గురిచేస్తూ భార్య జననాంగాల్లోకి మేకులను గుచ్చాడు. బాధిత మహిళ తన భర్తపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఉత్తర్​ప్రదేశ్​లోని రాంపుర్​లో ఈ ఘటన జరిగింది.

పెళ్లైనప్పటి నుంచి తన భర్త ఎప్పుడూ కొట్టేవాడని బాధితురాలు తెలిపింది. మద్యానికి బానిసై రోజూ తనపై చెయ్యి చేసుకునేవాడని... సోమవారం సైతం తాగి ఇంటికి వచ్చిన భర్త తనతో గొడవ పడ్డాడని చెప్పింది. ఈ క్రమంలోనే రహస్య భాగాల్లోకి మేకులను దించాడని వాపోయింది. ఇదంతా జరిగినా తన అత్త ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది బాధిత మహిళ. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని తన భర్త బెదిరింపులకు పాల్పడ్డాడని పేర్కొంది.

పరిస్థితి విషమంగా మారడం వల్ల మహిళను ఆస్పత్రికి తరలించాడు భర్త. కడుపు నొప్పి వచ్చిందంటూ వైద్యులకు తెలిపాడు. అయితే, ఈ విషయంపై వైద్యులకు బాధితురాలు నిజం చెప్పింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు.. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే, తర్వాత భార్యాభర్తల మధ్య సయోధ్య కుదిరిందని పోలీసులు వెల్లడించారు. చివరకు మేకులు గుచ్చలేదని మహిళ తెలిపిందని చెప్పారు.

ఇదీ చదవండి- ఎన్​కౌంటర్ స్పెషలిస్ట్​ అని చెప్పి ముగ్గురితో పెళ్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.