ETV Bharat / bharat

భార్య గొంతు నులిమి హత్య.. డ్రమ్ములో పెట్టి అడవిలో.. - bihar crime news

కర్ణాటకలో దారుణమైన ఘటన జరిగింది. అనుమానంతో తరచూ గొడవలు పడుతుందనే కోపంతో భార్యను గొంతు నులిమి హత్య చేశాడు ఓ వ్యక్తి. హత్య చేసి అనుమానం రాకుండా అడవిలో పడేశాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు బయటకొచ్చాయి.

Husband killed his wife and hide her deady body in water barrel
భార్యకు అనుమానం ఉందని..హత్యచేసి అడవిలో పడేసిన వ్యక్తి
author img

By

Published : Feb 27, 2023, 12:16 PM IST

Updated : Feb 27, 2023, 2:08 PM IST

కర్ణాటక కారావార్ జిల్లాలో భార్యను హత్య చేసి శవాన్ని అడవిలో పడేశాడు ఓ వ్యక్తి. వేరే మహిళలతో సంబంధాలున్నాయేమో అనే అనుమానంతో భార్య గొడవ పడటం వల్ల ఫిబ్రవరి 22 రాత్రి హత్య చేశాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఇదీ జరిగింది
హలియాల్ తాలూకా తేరగావ్ గ్రామానికి చెందిన తుకారాం, శాంతకుమారికి కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే భర్తకు ఇతర మహిళలతో సంబంధాలున్నాయనే అనుమానంతో భార్య తరచూ గొడవపడుతుండేది. ఫిబ్రవరి 22వ తేదీ రాత్రి కూడా ఈ విషయంపై గొడవ జరిగింది. దీంతో ఆగ్రహించిన భర్త ఆమె గొంతు నులిమి హత్య చేశాడు.

అనంతరం హత్య జరిగిన విషయం బయటకు రాకుండా శవాన్ని నీటి డ్రమ్ములో దాచి పెట్టాడు. ఒక వాహనాన్ని అద్దెకు తీసుకున్నాడు. డ్రైవర్‌ రిజ్వాన్‌, అల్నవార్‌కు చెందిన సమీర్‌ పాంటోజీ సహాయంతో మృతదేహాన్ని రాంనగర్‌ అడవిలోకి తీసుకెళ్లాడు. నీటి డ్రమ్ము నుంచి శవాన్ని తీయడం చూసిన స్థానికులు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దర్యాప్తు చేపట్టిన రాంనగర్ పోలీసులు.. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితులు తుకారాం, రిజ్వాన్, సమీర్ పాంటోజీ హాలియా సబ్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

బిహార్​లో మరో విషాద ఘటన
బిహార్​ బాంకాలో మరో విషాదం జరిగింది. మానవత్వం లేని 40ఏళ్ల వ్యక్తి రెండేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు. 'ఆదివారం రాత్రి గ్రామంలో పెళ్లి ఊరేగింపు జరిగింది. దానిని చూడటానికి అందరూ బయటకు వచ్చారు. పాప కూడా బయటకు వచ్చింది. తర్వాత పాప మాయమైంది. ఎంత వెతికినా దొరకలేదని' పాప తండ్రి తెలిపారు. అయితే డ్రైవర్ ప్రదీప్ యాదవ్ ఇంట్లో పాప రక్తపు మడుగులో పడి ఉంది. వెంటనే పాపను జవహారలాల్​ నెహ్రూ మెడికల్ కాలేజ్ ఆస్పత్రికి తరలించారు. పాప కుటుంబ సభ్యులు ప్రదీప్​ను రాజౌన్ పోలీస్ స్టేషన్​కు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

Last Updated : Feb 27, 2023, 2:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.