ETV Bharat / bharat

కోర్టులోనే భార్య కాలు నరికేసిన భర్త.. ఆస్తి గొడవలతో...

కోర్టు ప్రాంగణంలోనే భార్య కాలిని తెగ్గోశాడు కిరాతక భర్త(Husband attacks Wife). దంపతుల మధ్య ఆర్థిక తగాదాల కేసు విచారణకు హాజరైన సమయంలోనే ఈ దాడికి ఒడిగట్టాడు ఆ వ్యక్తి.

crime news
కోర్టు ప్రాంగణంలోనే భార్య కాలిని నరికేసిన భర్త
author img

By

Published : Sep 29, 2021, 6:48 PM IST

Updated : Sep 29, 2021, 7:21 PM IST

కోర్టు ప్రాంగణంలోనే భార్యపై దాడికి తెగబడ్డాడు ఓ కిరాతక భర్త (Husband attacks Wife). భార్య కాలిని తెగ్గోశాడు. స్పృహ కోల్పోయిన మహిళ.. అక్కడే పడిపోయింది. కర్ణాటకలోని బెళగావి జిల్లా కోర్టులో (Belgaum District Court) ఈ ఘటన జరిగింది.

Husband cut his wife's leg in the premises district court
కోర్టు ప్రాంగణంలో బాధిత మహిళ

విశ్రాంత జవాను శివప్ప అడకి, తన భార్య జయమాల మధ్య వివాదాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో గత కొద్దిరోజుల నుంచి దంపతులు గొడవ పడుతున్నారు. దీనికి సంబంధించి కోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ విషయమై బుధవారం జరిగిన విచారణకు వీరిద్దరూ హాజరయ్యారు.

ఆ సమయంలోనే భార్యపై దారుణంగా దాడి చేశాడు శివప్ప. కోర్టు భవన ప్రాంగణంలోనే భార్య కాలును కోసేశాడు. మహిళను బెళగావిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

శివప్పకు, జయమాలకు 11 ఏళ్ల క్రితం వివాహమైంది.

ఇవీ చదవండి:

పట్టపగలే కోర్టులో కాల్పులు.. ముగ్గురు మృతి

దిల్లీ హైకోర్టు బయట కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Last Updated : Sep 29, 2021, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.