ETV Bharat / bharat

Hurriyat Conference: గిలానీ వారసుడు మసరత్‌ ఆలం భట్‌ - సయ్యద్‌ అలి షా గిలానీ గురించి చెప్పండి

వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్(Hurriyat Conference)​ ఛైర్మన్​గా మసరత్‌ ఆలం భట్ నియమితులయ్యారు. ఈ సంస్థకు జీవితకాల ఛైర్మన్​గా వ్యవహరించిన సయ్యద్‌ అలి షా గిలానీ మరణంతో (Death of Syed Ali Shah Geelani) ఈ నిర్ణయం తీసుకంది సంస్థ. జమ్ముకశ్మీర్​లో జరిగిన 2010నాటి అల్లర్లతో భట్ వెలుగులోకి వచ్చారు.

మసరత్‌ ఆలం భట్‌
మసరత్‌ ఆలం భట్‌
author img

By

Published : Sep 8, 2021, 7:28 AM IST

జమ్ముకశ్మీర్‌లో 2010 నాటి ఆందోళనల ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించిన మసరత్‌ ఆలం భట్‌(50) అతివాద 'హురియత్‌ కాన్ఫరెన్స్‌'(Hurriyat Conference) కొత్త అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పాకిస్థాన్‌ అనుకూల వేర్పాటువాద నేత సయ్యద్‌ అలి షా గిలానీ(Syed Ahmed Shah Geelani) వారం రోజుల కిందట మృతిచెందడంతో ఆయన వారసుడిగా సైన్స్‌ పట్టభద్రుడైన మసరత్‌ పేరు ఖరారు చేశారు. తీవ్రవాద సంస్థలకు ఆర్థికసాయం చేశారన్న అభియోగంతో 2019 అక్టోబరులో జాతీయ పరిశోధన సంస్థ (ఎన్‌ఐఏ) చార్జిషీటు దాఖలు చేయగా ప్రస్తుతం ఈయన తిహార్‌లో జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. హవాలా రాకెట్‌ ద్వారా చేతులు మారిన ఈ నిధులు గిలానీ సహా పలువురు వేర్పాటువాదులకు అందినట్లు అప్పట్లో ఎన్‌ఐఏ తెలిపింది. ఈ నిధుల కారణంగానే హురియత్‌లో చీలికలు ఏర్పడినట్టు భట్‌ తెలిపినట్టు కూడా వెల్లడించింది.

మసరత్‌ ఆలం భట్‌
మసరత్‌ ఆలం భట్‌

లోయలో పదేళ్ల కిందట రేగిన అలజడి సందర్భంగా జరిగిన ప్రదర్శనలో బాష్పవాయు ప్రయోగంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఆ సమయంలో తిరుగుబాటు కరపత్రాల పంపిణీ ద్వారా మసరత్‌ వెలుగులోకి వచ్చారు. ఈయన మీద రూ.10 లక్షల రివార్డు ప్రకటించి, నాలుగు నెలల తర్వాత శ్రీనగర్‌ శివారులో అరెస్ట్‌ చేశారు. నిషేధిత నక్సల్‌ గ్రూపులతోనూ మసరత్‌కు సంబంధాలు ఉండేవి.

మంగళవారం హురియత్‌ కాన్ఫరెన్స్‌ (Hurriyat Conference)​ పేరిట అందిన ఓ పత్రికా ప్రకటనలో 'జమ్ముకశ్మీర్‌ ప్రజలు ఎన్నో అంచనాలతో సమ్మిళిత నాయకత్వం వైపు చూస్తున్నారు' అని పేర్కొన్నారు. ఈ కూటమికి షబీర్‌ అహ్మద్‌ షా, గులాం అహ్మద్‌ గుల్జార్‌ ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు. హురియత్‌ నిబంధనల మేరకు ఎన్నికలు జరిగేదాకా, ఈ నియామకాలు కొనసాగుతాయని అందులో తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.