ETV Bharat / bharat

అసెంబ్లీకి వందేళ్లు- శతాబ్ది వేడుకలకు రాష్ట్రపతి రాక - రాష్ట్రపతి

తమిళనాడు శాసనసభ ప్రారంభమై వందేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో శతాబ్ది వేడుకలకు శాసనసభ ముస్తాబైంది. వేడుకల్లో భాగంగా అసెంబ్లీ మందిరంలో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటాన్ని ఆవిష్కరించేందుకు ఆగస్టు 2న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరుకానున్నారు.

Hundred Anniversary of the Tamil Nadu Assembly
అసెంబ్లీకి వందేళ్లు
author img

By

Published : Aug 2, 2021, 6:59 AM IST

తమిళనాట శాసనసభ ప్రారంభమై వందేళ్లు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో శతాబ్ది వేడుకలకు శాసనసభ ముస్తాబైంది. వేడుకల్లో భాగంగా అసెంబ్లీ మందిరంలో దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి చిత్రపటాన్ని ఆవిష్కరించేందుకు ఆగస్టు 2న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరుకానున్నారు.

రాష్ట్రంలో మొదట ఎన్నికైన అసెంబ్లీని మద్రాసు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ అని పిలిచేవారు. భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం 1921లో ఇది ఏర్పాటైంది. ఆ తరువాత మద్రాసు ప్రావిన్స్‌గా, తమిళనాడు శాసనసభగా రూపాంతరం చెందిన ఈ సభకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అనేక సామాజిక సంస్కరణలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచింది. అసెంబ్లీ శతాబ్ది ఉత్సవాలు తమ హయాంలో నిర్వహించడాన్ని డీఎంకే గర్వంగా భావిస్తోంది. 1921లో ఏర్పడిన మద్రాసు లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ పదవీకాలం మూడేళ్లు ఉండేది. 132 మంది సభ్యులుండేవారు. వీరిలో 34 మంది గవర్నర్‌ నామినేట్ చేసేవారు. మిగిలినవారు ఎన్నికైన సభ్యులు. ఈ కౌన్సిల్‌కు తొలుత జరిగిన ఎన్నికల్లో జస్టిస్‌ పార్టీ 98 స్థానాలకు 63 చోట్ల గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమం నిర్వహిస్తున్నందున ఎన్నికల్లో కాంగ్రెస్‌ పాల్గొనలేదు. తరువాత 1923 నుంచి మూడేళ్లపాటు, 1930 నుంచి 1937 వరకు జస్టిస్‌ పార్టీ పాలించింది. ఆ పార్టీ మూలాలనుంచే ద్రావిడర్‌ కళగం, డీఎంకే వంటి పార్టీలు ఆవిర్భవించాయి. 1937నుంచి 39 వరకు సి.రాజగోపాలచారి (కాంగ్రెస్‌) ముఖ్యమంత్రిగా సేవలందించారు. మద్రాస్‌ ప్రావిన్స్‌గా ఏర్పడ్డాక 1952 నుంచి 54వరకు సి.రాజగోపాలచారి ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1954నుంచి 67వరకు కాంగ్రెస్‌ పాలించింది. 1967లో డీఎంకే మొదటిసారి ప్రభుత్వం ఏర్పాటుచేసినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అన్నాదురై తమ ప్రభుత్వం 1921లో అధికారంలోకి వచ్చిన జస్టిస్‌ పార్టీ అనుసరించిన విధానాలను కొనసాగిస్తుందని ప్రకటించారు. ప్రస్తుత సీఎం స్టాలిన్‌ కూడా ఇదే విషయాన్ని అసెంబ్లీలో పునరుద్ఘాటించారు.

అత్యధిక పాలనాకాలం వీరిది..

డీఎంకే అగ్రనేత కరుణానిధి (సుమారు 19 ఏళ్లు), ఏఐఏడీఎంకే నుంచి జయలలిత (14ఏళ్ల 124 రోజులు), ఎంజీ రామచంద్రన్‌ (10ఏళ్ల 65 రోజులు), కాంగ్రెస్‌ నుంచి కె.కామరాజ్‌ (9ఏళ్ల 172 రోజులు) సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రులుగా సేవలందించారు. వీరితోపాటు 1952 నుంచి సి.రాజగోపాలచారి, ఎం.భక్తవత్సలం, అన్నాదురై, వీఆర్‌ నెడుంజెళియన్‌ (యాక్టింగ్‌), జానకీ రామచంద్రన్‌, పన్నీర్‌సెల్వం, పళనిస్వామి ముఖ్యమంత్రులుగా కొనసాగారు. రాష్ట్రంలో నాలుగుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ప్రస్తుతం శాసనసభలో 234 మంది సభ్యులుండగా.. డీఎంకే కూటమికి 165, అన్నాడీఎంకే కూటమికి 75మంది సభ్యులున్నారు.

ఇదీ చూడండి: 50 ఏళ్ల తర్వాత ఆ మార్గంలో తొలి​ రైలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.