కరోనాను కట్టడి చేయడానికి.. మహమ్మారి ప్రభావం వల్ల జరుగుతున్న నష్టానికి అడ్డుకట్ట వేసేందుకు.. స్పష్టమైన వ్యాక్సినేషన్ వ్యూహంతో పాటు ఆర్థిక భరోసా కల్పించడం అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచించారు. ప్రభుత్వం నిజాలను దాచి పెడుతూ.. అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వ వైఖరి సమస్యను పెంచుతోందన్నారు. ప్రభుత్వం అన్ని హెచ్చరికల వ్యవస్థను మూసివేసిందని విమర్శించారు. కొవిడ్ పరిస్థితిని వివరిస్తూ.. "ఇప్పుడు మనం నడిసంద్రంలో ఉన్నాం. నౌక ఎటు వెళ్లాలో తెలియదు" అని వ్యాఖ్యానించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితికి ప్రధాని నరేంద్ర మోదీదే బాధ్యత అని ఆరోపించారు.
ఇదీ చూడండి: '70 ఏళ్ల కాంగ్రెస్ కష్టాన్ని వృథా చేశారు'