ETV Bharat / bharat

Boy Murder: అప్పుల గొడవలో బాలుడు బలి.. 'నరబలి' కేసును ఛేదించిన పోలీసులు.. - బాలుడు నరబలి

human sacrifice
human sacrifice
author img

By

Published : Apr 21, 2023, 8:04 AM IST

Updated : Apr 21, 2023, 2:19 PM IST

12:19 April 21

..

ఎంతటి వారైనా విడిచి పెట్టే ప్రసక్తే లేదు: తలసాని

..

08:01 April 21

Boy Murder in Hyderabad: సనత్‌నగర్‌లోని అల్లాదున్‌ కోటి ఏరియాలో ఘటన

బాలుడు
బాలుడు

Boy Murder in Hyderabad: భాగ్యనగరంలో బాలుడి హత్య తీవ్ర కలకలం రేపుతోంది. బస్తీలో బాబును అపహరించిన కిరాతకులు.. అతి కిరాతకంగా హతమార్చారు. ఎక్కడికక్కడ ఎముకల్ని విరిచి.. ఓ బకెట్‌లో కుక్కారు. స్థానికంగా నివసించే ఓ హిజ్రా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హత్య తీరును చూసి.. నరబలి ఇచ్చినట్లుగా స్థానికులు అనుమానించారు. అయితే పోలీసులు మాత్రం విచారణ చేపట్టి ఆర్థిక పరమైన హత్యగా నిర్ధారించారు. అఘాయిత్యానికి పాల్పడిన హిజ్రాను అరెస్ట్​ చేసి.. బాల్​నగర్​ డీసీపీ కార్యాలయానికి తరలించారు.

చిట్టీ డబ్బుల గురించే బాలుడి హత్య..: హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని అల్లాదున్‌ కోఠిలో నివసించే రెడీమేడ్‌ దుస్తుల వ్యాపారి వసీంఖాన్‌ కుమారుడిని స్థానికంగా నివసించే ఫిజాఖాన్‌ అనే ఓ హిజ్రా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. చిట్టీల వ్యాపారం నిర్వహించే ఫిజాఖాన్‌ వద్ద వసీంఖాన్‌ చిట్టీలు వేశాడు. దీనికి సంబంధించిన డబ్బును ఫిజాఖాన్‌ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య నిన్న వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో నిన్న సాయంత్రం వసీంఖాన్‌ కుమారుడిని నలుగురు వ్యక్తులు బస్తీలోని ఓ వీధిలో అపహరించారు. ప్లాస్టిక్‌ సంచిలో తీసుకుని ఫిజాఖాన్‌ ఇంటి వైపునకు వెళ్లారు. బాలుడు కనిపించకపోవడంతో తండ్రి వసీంఖాన్‌ రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్థానికులు ఇచ్చిన సమాచారం, సీసీ ఫుటేజీల ఆధారాలతో నిందితులను పట్టుకున్నారు.

ఎముకలను విరిచి బకెట్​లో కుక్కి: బాలుడి మృతదేహాన్ని జింకలవాడ సమీపంలోని ఓ నాలాలో వేసినట్లు నిందితులు అంగీకరించడంతో గురువారం అర్ధరాత్రి పోలీసులు స్థానికుల సాయంతో నాలాలో వెతికారని డీసీపీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఓ ప్లాస్టిక్‌ సంచిలో మృతదేహం ఉన్నట్లు గుర్తించి వెలికి తీశామని చెప్పారు. బాలుడిని హత్య చేసిన నిందితులు.. ఎముకలను ఎక్కడికక్కడ విరిచి ఓ బకెట్‌లో కుక్కారని వివరించారు. బకెట్‌ను ప్లాస్టిక్‌ సంచిలో తీసుకుని వెళ్లి నాలాలో విసిరేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. బాలుడిని నరబలి ఇచ్చినట్లుగా బస్తీవాసులు అనుమాన పడుతున్నారని అందులో నిజం లేదని.. ఆర్థిక పరమైన కారణాలతోనే హత్య చేశారని స్పష్టం చేశారు. ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనతో అల్లాదున్‌ కోటి బస్తీలో ఉద్రిక్తత నెలకొంది.

మంత్రి తలసాని పరామర్శ: సనత్​నగర్​ బాలుడి మృతి చాలా బాధాకరమని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్​ అన్నారు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు. నిందితులు ఎంతటి వారైనా.. వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. మృతుని కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బస్తీవాసుల భయాన్ని పోగొట్టేందుకు పోలీస్​ బందోబస్తును ఏర్పాటు చేస్తామని తలసాని పేర్కొన్నారు.

"పోలీసులు నరబలి కాదు అంటున్నారు. పోలీస్​ దర్యాప్తులోనూ, బస్తీలో జరిగిన సంఘటనలోనూ అది నరబలి కాదని రుజువు అయింది. అంత చిన్న పిల్లవాడిని చంపడానికి వారికి చేతులు ఎలా వచ్చాయో తెలియడం లేదు. వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తాం. వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు." - తలసాని శ్రీనివాస యాదవ్, మంత్రి​

ఇవీ చదవండి:

Last Updated : Apr 21, 2023, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.