హిమాచల్‌ప్రదేశ్ ఉప ఎన్నికల్లో(hp by election 2021) అధికార భాజపాకు కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. మూడు అసెంబ్లీ స్థానాలు జుబ్బల్-కోట్కాయ్, ఫతేపుర్, అర్కీలో ఘన విజయం సాధించింది. మండీ లోక్‌సభ స్థానంలోనూ విజయం సాధించింది.
మండీలో కాంగ్రెస్ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్.. భాజపా అభ్యర్థి కుశాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. 2019 ఎన్నికల్లో భాజపా ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. అప్పుడు గెలిచిన ఎంపీ రామ్ స్వరూప్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది(himachal election result 2021).
సీఎం జైరాం ఠాకూర్ సొంత జిల్లా మండీలో కాంగ్రెస్ గెలవడం భాజపాకు ఆందోళన కలిగించే విషయం. వచ్చే ఏడాది హిమచల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌కు ఈ ఫలితాలు సానుకూలంగా మారే అవకాశముంది(himachal pradesh election 2021).
ఇవీ చదవండి: ఉపఎన్నికల్లో అధికార పార్టీలదే హవా- భాజపాకు మిశ్రమ ఫలితాలు