ETV Bharat / bharat

How to Use Rajmarg Yatra App : గూగుల్ మ్యాప్​లో ప్రాబ్లమా..? "రాజ్​మార్గ్" ట్రై చేశారా?

How to Download Rajmarg Yatra App : మనం ఒక్కోసారి పరిచయం లేని ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు మెజారిటీ పీపుల్ వాడేది గూగుల్ మ్యాప్స్. అయితే.. ఒక్కోసారి ఇది సరైన మార్గాన్ని చూపించలేకపోవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నయా యాప్​ తీసుకొచ్చింది..!

How to Use Rajmarg Yatra App
Rajmarg Yatra App
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 29, 2023, 9:54 AM IST

How to Download Rajmarg Yatra App Online : మనం సాధారణంగా ఏదైనా తెలియని ప్రాంతానికి వెళ్తున్నప్పుడు.. రూట్ కోసం గూగుల్ మ్యాప్ వాడుతుంటాం. అయితే.. ఒక్కోసారి ఇది సరైన మార్గాన్ని చూపించకపోవచ్చు. ఇలాంటప్పుడు వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం(Central Government) సరికొత్త యాప్​ని అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి, ఇంతకీ ఏంటీ ఆ యాప్? ఫీచర్స్ ఏంటి? వంటి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Rajmarg Yatra App Details in Telugu : ఈ యాప్ జాతీయరహదారుల్లో ప్రయాణించేవారికి ఉద్దేశించినది. నేషనల్ హైవేలపై జర్నీ చేసే వారికి మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా.. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) "రాజ్​మార్గ్ యాత్ర" పేరుతో ఈ యాప్​ను విడుదల చేసింది. 'సిటిజన్-సెంట్రిక్ యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్'ని రూపొందించే ప్రయత్నంలో భాగంగా.. దీనిని తీసుకొచ్చినట్లు ఎన్​హెచ్​ఏఐ తెలిపింది. ఈ యాప్ ద్వారా వాహనదారులు.. చాలా ఈజీగా రహదారుల సమాచారం తెలుసుకుంటారు. ఎన్‌హెచ్‌ఏఐలకు సంబంధించిన సమస్యల గురించి ఫిర్యాదు కూడా చేయొచ్చు. ప్రస్తుతం ఈ యాప్ హిందీ, ఆంగ్ల భాషల్లో అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లు ప్లే స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

How to Download Rajmarg Yatra App For iOs Users in Telugu :

ఐఓఎస్‌ యూజర్లు రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే..?

  • మీరు మొదట మీ iOS సపోర్టింగ్ ఫోన్​లో యాప్ స్టోర్‌ని ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత సెర్చ్ బార్‌లో 'రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌' అని ఎంటర్ చేయాలి.
  • అప్పుడు మీరు GET ట్యాబ్‌ని క్లిక్ చేస్తే.. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ మీ స్మార్ట్​ఫోన్​లో డౌన్‌లోడ్ అవుతుంది.
  • ఇలా మీరు ఈ యాప్​ను ఇన్​స్టాల్ చేసుకున్న తర్వాత దీంట్లో ఈజీగా రహదారులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని పొందవచ్చు.

How to Download Rajmarg Yatra App for Android Users in Telugu :

ఆండ్రాయిడ్ యూజర్లు రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండిలా..

  • మొదట మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో Google Play Store యాప్‌ని ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత సెర్చ్ బాక్స్​లో "రాజ్‌మార్గ్ యాత్ర"ని ఎంటర్ చేయాలి. ఆపై రాజ్‌మార్గ్ యాత్ర యాప్ డౌన్‌లోడ్ ట్యాబ్ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేసి యాప్​ను డౌన్​లోడ్ చేసుకుని ఇన్​స్టాలేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.
  • ఇలా మీరు దీనిని ఇన్​స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్​గా దీంట్లో రహదారులకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందవచ్చు.

Ula Rail Yatra in INDIA : త్రిశక్తి పీఠ యాత్ర పేరుతో ప్రత్యేక రైలు... ఛార్జీలు ఎంతంటే..

Rajmarg Yatra App Benefits in Telugu : రాజ్‌మార్గ్ యాత్ర యాప్​ ద్వారా జాతీయ రహదారిపై ప్రయాణించే సమయంలో వాహనదారులు వాతావరణ వివరాలతోపాటు దగ్గర్లోని టోల్‌ ప్లాజా, పెట్రోల్‌ బంకులు, ఆస్పత్రులు, హోటల్స్‌ గురించిన సమాచారం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఫొటో, వీడియో జియో-ట్యాగింగ్‌ ద్వారా జాతీయ రహదారులపై ఉన్న సమస్యల గురించి కూడా యాప్‌లో ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ సంబంధిత అధికారులు వాహనదారుడి ఫిర్యాదుకు స్పందించకపోతే.. యాప్‌లోని సాంకేతికత సదరు ఫిర్యాదును ఆటోమేటిగ్గా ఉన్నతాధికారులకు పంపిస్తుంది.

Rajmarg Yatra App Features in Telugu : ఈ రాజ్‌మార్గ్ యాత్ర యాప్‌ ద్వారా ప్రయాణికులు ఫాస్ట్‌టాగ్‌(Fast tag) రీఛార్జ్‌, నెలవారీ పాసులు వంటి సేవలను కూడా పొందొచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే.. ఈ యాప్​లో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక ఫీచర్‌ ఉందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. అదేవిధంగా వాహనం పరిమిత వేగాన్ని మించి ప్రయాణిస్తుంటే ఫోన్‌కు నోటిఫికేషన్‌ కూడా పంపిస్తుంది.

అలాగే మైక్రోఫోన్, ఫోన్‌ లొకేషన్‌ వంటి వాటిని ఉపయోగించేందుకు దీనికి అనుమతి ఇవ్వాలి. హైవేలపై బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ ప్రవర్తనను ఈ యాప్ ప్రోత్సహిస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఇందులో వాయిస్‌ అసిస్టెంట్ ఫీచర్‌ కూడా ఉందని పేర్కొంది. రాజ్​మార్గ్ యాత్ర యాప్ ద్వారా ప్రయాణికులకు రోడ్ నెట్‌వర్క్‌ సమాచారంతోపాటు, యూజర్‌ ఫ్రెండ్లీ అనుభవాన్ని అందించాలని ఆశిస్తున్నట్టు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది.

భారత్ గౌరవ్.. పూరీ - కాశీ - అయోధ్య యాత్రికుల కోసం ప్రత్యేక రైలు

'ఆ రోడ్డు ప్రమాదాలకు ఇకపై అధికారులే బాధ్యులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.