ETV Bharat / bharat

ఇంట్లోకి సరుకులు కొంటున్నారా? ఇలా డబ్బు ఆదా చేసుకోండి!

Grocery Shopping: దుస్తులు కొనుగోలు చేయడానికే కాదు.. కిరాణా సరుకులు కొనడానికి కూడా పెద్ద పెద్ద మాల్స్​కు వెళ్లడం అలవాటైపోయింది జనాలకు. ఇలా వెళ్లడానికి కారణాలు ఏమైనప్పటికీ.. మాల్​ నుంచి బయటకు వచ్చి చూస్తే మాత్రం.. జేబుకు పెద్ద చిల్లే పడి ఉంటుంది. కొన్ని టిప్స్ పాటించడం ద్వారా.. డబ్బు సేవ్ చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Grocery_Shopping
Grocery_Shopping
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 20, 2023, 3:00 PM IST

Groceries Shopping Tips in Telugu: ప్రతి నెలా ఇంటికి కావాల్సిన కిరాణా సరుకులు కొనుగోలు చేసేందుకు చాలా మంది సూపర్ మార్కెట్లకు, మాల్స్​కు వెళ్తుంటారు. అన్నీ ఒకేదగ్గర దొరుకుతాయనో.. ధర ఒకటీరెండు రూపాయలు తక్కువగా ఉంటుందనో వెళ్తుంటారు. అయితే.. కొనుగోలు పూర్తయ్యే సరికి బడ్జెట్ దాటిపోయి ఉంటుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది.

లిస్ట్​ తయారు చేసుకోండి: ఇంట్లో కావాల్సిన వస్తువులు, సరుకులు కొనేటప్పుడు బడ్జెట్ ముందుగా ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ దీన్ని పాటించాలి. దీనికోసం.. సూపర్ మార్కెట్‌ లేదా మాల్స్​కు వెళ్లడానికి ముందే.. మన ఇంట్లో ఏం ఉన్నాయో చూసుకోవాలి. లేనివాటితో ఓ లిస్ట్ తయారు చేసుకోవాలి. దీనివల్ల.. ఇంట్లో వస్తువులు ఉండగానే మరోసారి కొనుగోలు చేయాల్సిన అవసరం రాదు.

హద్దు దాటొద్దు : మీరు ఎప్పుడు ఎలాంటి షాపింగ్​కు వెళ్లినా.. ఒక రూల్ పెట్టుకోవాలి. అదేమంటే.. మీరు కచ్చితంగా లిస్టు తయారు చేసుకొని వెళ్లాలి. అంతవరకే కొనుగోలు చేయాలి. ఎంత ఊరించినా సరే.. మీ లిస్టులో లేని వస్తువు కొనుగోలు చేయకూడదు. చాలా మంది డబ్బు దుబారా చేసేది ఈ విషయంలోనే! 10 వస్తువులు కొనడానికి వెళ్లి.. పాతిక వస్తువులు ఇంటికి మోసుకెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితికి వెంటనే చెక్ పెట్టగలిగితే.. చాలా డబ్బు ఆదా అవుతుంది.

కార్తికమాసం-ఈ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైనా దర్శించుకోవాలట!

ఆఫర్ల మాయలో పడకండి : ఒకటి కొంటే మరొకటి ఫ్రీ అనో.. మూడు కొంటే కొంత డబ్బు కలిసి వస్తుందనో.. ఆఫర్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. ఆ వైపు కన్నెత్తి కూడా చూడొద్దు. మీ దృష్టి మీ లిస్టు మీద మాత్రమే ఉండాలి. ఎలాంటి ఆఫర్లు ఎంత ఊరించినా.. బడ్జెట్​ దాటివెళ్లకండి.

ఎక్స్​పైరీ డేట్ చెక్​ చేయాలి: కొంత మంది ఆఫర్లు ఉన్నాయి కదా అని వెనకా ముందు చూడకుండా ఎడాపెడా కొనేస్తారు. ఒక సరుకును ఆఫర్లో పెట్టారంటే.. అప్పుడు ఖచ్చితంగా ఎక్స్​పైరీ డేట్ చూసుకోవాలి. ఇలా చెక్​చేయడం వల్ల సరుకులు పాడవకుండా ఉంటాయి. ముఖ్యంగా తిను బండారాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా చూడాలి. వస్తువులు కొన్నప్పుడు లేబుల్స్ చెక్ చేయండి. ఎక్స్‌పైరీ డేట్ దాటిపోయిన వస్తువులు కొంటే.. వాటితో ఇబ్బందులు రావడంతోపాటు డబ్బు దుబారా అయిపోతుంది.

ఈజీగా బరువు తగ్గాలా? తిన్న తర్వాత నీరు ఇలా తాగి చూడండి!

కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? - అయితే ఈ టిప్స్ పాటించి నష్టాలకు నో చెప్పండి!

క్యారీ బ్యాగ్ తీసుకెళ్లండి : సరుకులు కొనడానికి వెళ్లిన ప్రతిసారీ ఓ కొత్త క్యారీ బ్యాగ్​ తీసుకొస్తారు చాలా మంది. దానికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా.. గుర్తు పెట్టుకొనిమరీ క్యారీబ్యాగ్ వెంట తీసుకెళ్లాలి. పైన పేర్కొన్న టిప్స్ పాటించడం వల్ల మీ డబ్బుతోపాటు టైమ్ కూడా ఆదా అవుతుంది.

మీ వంటగ్యాస్ త్వరగా అయిపోతోందా? - ఈ టిప్స్​తో నెల వచ్చేది 2 నెలలు రావడం పక్కా!

అత్తాకోడళ్లు తల్లీకూతుళ్లలా మెలగాలా? ఇలా చేస్తే నిత్య సంక్రాంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.