UPI Payments Without Internet : ఇవాళ ఆన్ లైన్ చెల్లింపులు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమైపోయాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో అనివార్యంగా అనుసరించాల్సి వచ్చిన ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్.. ఇప్పుడు పూర్తి అవసరంగా మారిపోయాయి. పాల ప్యాకెట్ కోసం వెచ్చించే 10 రూపాయలు మొదలు.. వేలాది రూపాయల లావాదేవీల దాకా UPI ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. అయితే.. అకౌంట్లో కావాల్సినన్ని డబ్బులున్నా.. మొబైల్లో కావాల్సినంత ఛార్జింగ్ ఉన్నా.. ఇంటర్నెట్ లేకపోతే మాత్రం చెల్లింపులు జరపలేరు. అప్పుడప్పుడూ ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే.. ఇకపై ఈ పరిస్థితికి చెక్ పెట్టే అప్డేట్ వచ్చేసింది. మొబైల్ ఫోన్లో ఒకే ఒక సెట్టింగ్ చేసుకోవడం ద్వారా.. ఇంటర్నెట్ లేకున్నా.. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే అవకాశం వచ్చింది. మరి, ఆ సెట్టింగ్ ఏంటి..? దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి? అనే వివరాలను ఇప్పుడు చూద్దాం.
వచ్చేసింది *99#..
*99# Code For UPI Payments :
ఇంటర్నెట్ లేకుండా.. మనీ ట్రాన్సాక్షన్ చేసేందుకు *99# సేవను వినియోగించుకోవాలి. ప్రస్తుతం ఈ సేవ దేశవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఈ సర్వీస్‌ను దేశంలోని 83 ప్రముఖ బ్యాంకులు అందిస్తున్నాయి. ఇంకా.. 4 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు కూడా అందిస్తున్నారు. ఇంగ్లీష్, హిందీతోపాటు దేశంలోని 13 ప్రముఖ భాషల్లో ఈ సేవ అందుబాటులో ఉంది. ఈ సేవకు సంబంధించిన సెట్టింగ్ ఒక్కసారి చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత రెగ్యులర్ గా ఆఫ్ లైన్లో UPI చెల్లింపులు చేసుకోవచ్చు.
డెబిట్ కార్డు లేకున్నా.. ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం ఎలా?
ఆఫ్‌లైన్ UPI చెల్లింపులను ఇలా సెట్ చేసుకోండి..
Off Line UPI Payments Settings in Mobile :
- మీరు UPI చెల్లింపుల కోసం వినియోగించే మొబైల్ నంబర్ నుంచి *99# నంబర్ కు డయల్ చేయాలి.
- ఆ తర్వాత.. మీకు అవసరమైన భాషను ఎంచుకోవాలి.
- ఇప్పుడు.. మీ బ్యాంక్ పేరును ఎంటర్ చేయాలి.
- మీ మొబైల్ నంబర్‌కు లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ల లిస్టు కనిపిస్తుంది.
- అందులో ఏ అకౌంట్నుంచి ట్రాన్సాక్షన్స్ జరగాలని అనుకుంటున్నారో.. దాన్ని సెలక్ట్ చేసుకోండి.
- తర్వాత.. మీ డెబిట్ కార్డ్ Expiry Dateతోపాటు కార్డ్ నంబర్లోని చివరి 6 అంకెలను నమోదు చేయండి.
- దీంతో.. మీరు సక్సెస్‌ఫుల్‌గా సెట్టింగ్స్ కంప్లీట్ చేసినవారవుతారు.
'యూపీఐ లావాదేవీలపై 0.3శాతం ఛార్జ్!.. ఏటా కేంద్రానికి రూ.5,000 కోట్లు'
చెల్లింపులు ఇలా..
Off Line UPI Payments :
- ఇంటర్నెట్ లేకుండా డబ్బులు సెండ్ చేయడానికి.. మొబైల్లో *99# నంబర్‌కు డయల్ చేసి, తర్వాత 1ని నొక్కాలి.
- ఆ తర్వాత మీరు మనీ సెండ్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఫోన్ నంబర్/ UPI ID/ బ్యాంక్ ఖాతా నంబర్ ఎంటర్ చేయాలి.
- అనంతరం ఎంత డబ్బు పంపాలో ఎంటర్ చేసి.. చివరగా UPI పిన్ నంబర్ ఎంటర్ చేయండి.
- అంతే.. మనీ సక్సెస్ ఫుల్ గా సెండ్ అవుతుంది.
- ఈ ఆప్షన్ ద్వారా.. ఒకసారి రూ.5 వేల వరకు చెల్లించవచ్చు.
- *99# సేవను వినియోగించుకుంటున్నందుకు.. ప్రతిసారీ 50 పైసలు ఛార్జీ పడుతుంది.
సూపర్ ఫీచర్‌తో పేటీఎం.. ఇకపై పిన్ లేకుండానే పేమెంట్స్
గూగుల్‌పే, ఫోన్‌పే చేస్తున్నారా? ఇలా మోసపోవచ్చు! బీ అలర్ట్!!