ETV Bharat / bharat

How To Lock And Unlock Aadhaar Card Online : ఆన్‌లైన్‌లో ఆధార్ కార్డ్‌ సేవలను లాక్, అన్‌లాక్ చేయడం తెలుసా..? చాలా ఈజీ..

How To Lock And Unlock Aadhaar Card Online : మీరు ఆధార్ కార్డ్‌ను వివిధ సేవలకు ఉపయోగిస్తున్నారా..? ఆధార్ కార్డ్ భద్రతా ఉల్లంఘనలు, వ్యక్తిగత డేటా లీక్‌లు గురించి తెలుసుకుంటున్నారా..? అలాగే, మీకు ఆధార్ కార్డ్‌ సేవలను లాక్, అన్‌లాక్ చేసుకోవటం ఎలాగో తెలుసా..?. మరెందుకు ఆలస్యం ఆ వివరాలను ఈ స్టోరీలో చదివి తెలుసుకోండి.

Lock And Unlock
Aadhaar Card
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2023, 2:56 PM IST

How To Lock And Unlock Aadhaar Card Online: భారతదేశంలో ఆధార్‌ కార్డ్ ఉపయోగం మార్కెట్‌లో ఎంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సిమ్‌కార్డు మొదలుకొని బ్యాంకు ఖాతా, వాహనాలు, ఇళ్లు, భూముల క్రయవిక్రయాలు, ప్రభుత్వ పథకాలు, విద్యార్థులకు అందించే ఉపకార వేతనాల వరకూ తప్పనిసరిగా ఆధార్ కార్డ్ (లింక్) ఉపయోగం పెరిగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డ్‌ ఉపయోగాలు, నష్టాలు, భద్రతా ఉల్లంఘనలు, వ్యక్తిగత డేటా లీక్‌లు, ఆన్‌లైన్‌లో ఆధార్ సేవలను లాక్ చేయటం, అన్‌లాక్ చేయటం వంటి అంశాలపై కచ్చితంగా అవగాహన ఉండాలి. మరీ ఆ విషయాలను గురించి మనం ఇప్పుడు ఈ స్టోరీలో విపులంగా చర్చించుకుందాం.

1. ఆధార్ (UID) కార్డ్‌ లాక్ &అన్‌లాక్ అంటే ఏమిటి?
What is Aadhaar (UID) Card Lock & Unlock: UIDAI (Unique Identification Authority of India) వినియోగదారుల ఆధార్ నంబర్‌కు భద్రత పెంచడానికి, నివాసికి నియంత్రణను అందించడానికి ఆధార్ నంబర్‌లను (UID) లాక్, అన్‌లాక్ చేసే ఓ ప్రత్యేక వెబ్‌సైట్‌, యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు UIDAI అధికారిక వెబ్‌సైట్ www.myaadhaar.uidai.gov.in లేదా mAadhaar యాప్ ద్వారా ఆధార్‌ను సులభంగా లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు. ఆధార్ (UID)ని అన్‌లాక్ చేసిన తర్వాత నివాసితులు ప్రామాణీకరణను పూర్తి చేయడానికి UID, UID టోకెన్, VIDలను ఉపయోగించాలి.

PVC Aadhar Card Apply : 'ఆధార్'​ పోయిందా? PVC కార్డ్​ కోసం అప్లై చేసుకోండిలా..

2. ఆధార్ సేవలను ఎలా లాక్ చేయాలి..?
How to lock Aadhaar services..?: ఆధార్ సేవలను లాక్ చేయాలంటే ముందుగా చేయాల్సింది.. మొబైల్ ఫోన్ నుంచి SMS పంపించాలి. UIDలో నాలుగు లేదా ఎనిమిది అంకెలు ఉండే GVID నెంబర్‌ను నమోదు చేసి స్పేస్ ఇచ్చి..1947 నెంబర్‌కు SMS పంపించాలి. దాంతో ఆధార్ సేవలు లాక్ చేయబడుతాయి.

  • 3. వెబ్‌సైట్ ద్వారా ఆధార్ సేవలను లాక్ చేయటం ఎలా?
    How to lock Aadhaar services through website?:
  • ముందుగా వినియోగదారులు UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • ఆ తర్వాత https://resident.uidai.gov.in/aadhaar-lockunlockపై క్లిక్ చేయాలి.
  • My Aadhaar కింద లాక్ ఆధార్‌పై క్లిక్ చేయాలి.
  • UID లాక్ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
  • UID నెంబర్, పేరు మొదలైనవాటిని నమోదు చేయాలి.
  • ఆ తర్వాత భద్రతా కోడ్‌ను నమోదు చేయాలి.
  • ఆ తర్వాత OTPని పంపు ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
  • OTPని నమోదు చేసిన తర్వాత సమర్పించుపై క్లిక్ చేయాలి.
  • దాంతో వినియోగదారుని UID విజయవంతంగా లాక్ చేయబడుతుంది.

UIDAI Warning : ఆధార్‌ యూజర్స్​కు వార్నింగ్‌.. వాట్సాప్​లో అలా చేస్తే..

4. ఆధార్ సేవలను అన్‌లాక్ చేయడం ఎలా?
How to Unlock Aadhaar Services?: ఆధార్ సేవలను వినియోగదారులు అన్‌లాక్ చేయాలంటే ముందుగా SMS ద్వారా అన్‌లాక్ చేయొచ్చు. అందుకు ముందుగా చేయాల్సింది.. RVID స్పేస్ UID చివరి 4 లేదా 8 అంకెలు టైపు చేసి 1947కి SMS చేయాలి.

5. వెబ్‌సైట్ ద్వారా ఆధార్ సేవలను అన్‌లాక్ చేయడం ఎలా?
How to unlock Aadhaar services through website?:

  • వినియోగదారులు ముందుగా UIDAI వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • ఆ తర్వాత https://resident.uidai.gov.in/aadhaar-lockunlockపై క్లిక్ చేసి, అన్‌లాక్‌ని ఎంపిక చేసుకోవాలి.
  • ఆ తర్వాత తాజా VID, భద్రతా కోడ్‌ను నమోదు చేయాలి.
  • Send OTPపై క్లిక్ చేయాలి.
  • OTPని నమోదు చేసి సమర్పించాలి.
  • దాంతో UID విజయవంతంగా అన్‌లాక్ చేయబడుతుంది.

6.mAadhaar యాప్‌లో లాక్, అన్‌లాక్ చేయటం ఎలా..?
How to lock and unlock mAadhaar app..?: నివాసితులు తమ ఆధార్ కార్డ్‌లను లాక్ చేయడానికి లేదా అన్‌లాక్ చేయడానికి mAadhaar యాప్‌ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత UID చివరి 4 లేదా 8 అంకెలను టైపు చేసి, RVID స్పేస్‌ ఇచ్చి, ఆధార్ రిజిస్టర్ మొబైల్ నంబర్‌ని 1947కి SMS పంపించి లాక్, అన్‌లాక్ చేసుకోవచ్చు.

'ఆధార్‌తో ప్రభుత్వానికి రూ.2 లక్షల కోట్లు ఆదా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.