How to Get Refund Even if You Miss The Train : దేశంలో ప్రతిరోజూ కోట్లాది మంది ప్రయాణికులు రైళ్ల ద్వారా ప్రయాణిస్తున్నారు. తమ ప్రయాణం కోసం రోజుల తరబడి ముందుగానే టికెట్లు బుక్ చేసుకుంటూ ఉంటారు. అయితే.. ఊహించని కారణాలతో కొందరు రైలు ఎక్కలేకపోతారు. దీంతో.. ట్రైన్ మిస్సవడంతోపాటు టికెట్ డబ్బులు కూడా నష్టపోయామని బాధపడతారు. కానీ.. ఇప్పుడు ఆ బాధ అవసరం లేదు. ఐఆర్‌సీటీసీ(IRCTC) అందిస్తున్న ఈ సౌకర్యం గురించి మీకు తెలిస్తే.. ట్రైన్ వెళ్లిపోయినా కూడా మీ టికెట్ డబ్బులు రీఫండ్ పొందవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
TDR ఫైల్ చేయాలి :
You will get Refund even If You Miss The Train : ఐఆర్‌సీటీసీ వెబ్సైట్లోకి వెళ్లి.. TDR (టికెట్ డిపాజిట్ రిసిప్ట్)ను ఫైల్ చేయడం ద్వారా.. మీ టికెట్ డబ్బును వాపస్ పొందవచ్చు. ట్రైన్ వెళ్లిపోయినప్పుడే కాకుండా.. ఇంకా పలు సందర్భాల్లో TDRను ఫైల్ చేయవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
- మీరు ప్రయాణించాల్సిన రైలు మూడు గంటల కంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నట్లయితే.. అందులో మీరు ప్రయాణించకపోతే రీఫండ్ కోసం అప్లై చేయొచ్చు.
- మీరు వెళ్లాలనుకున్న రైలు పూర్తిగా క్యాన్సిల్ అయితే.. TDR ఫైల్ చేయకుండానే రీఫండ్ పొందొచ్చు.
- ఏదైనా కారణంతో మీరు ప్రయాణించాల్సిన రైలు రూటు మళ్లించడం వల్ల.. మీరు ఆ రైలు అందుకోకపోయినా రీఫండ్ పొందొచ్చు.
- రూటు మళ్లించడం వల్ల మీరు ఎక్కాల్సిన రైలు మీ స్టేషన్‌కు రాకపోయినా TDR ఫైల్ చేయొచ్చు.
- టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. మీకు సీటు దొరక్కపోతే కూడా TDR ఫైల్ చేసి రీఫండ్ కోరొచ్చు.
TDR ఎలా ఫైల్ చేయాలి..?
- మీరు రైలు మిస్ అయినప్పుడు TDR ఫైల్ చేయడం ద్వారా టికెట్ డబ్బులు వాపసు పొందాలనుకుంటే.. రైలు టిక్కెట్‌ను రద్దు చేయకూడదు.
- TDRను.. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్.. రెండు పద్ధతుల్లో ఫైల్ చేయొచ్చు.
- ఆఫ్‌లైన్‌లో TDR ఫైల్ చేయాలంటే.. TTE నుంచి మీరు సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది.
- ఆన్లైన్లో ఫైల్ చేయాలనుకుంటే.. IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో మీరు TDRను ఫైల్ చేయొచ్చు.
- ఒకవేళ ఆన్లైన్లో చేస్తున్నారనుకుంటే.. IRCTC వెబ్‌సైట్/యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
- ఆ తర్వాత "మై అకౌంట్" సెక్షన్‌లోని టికెట్ హిస్టరీపై క్లిక్ చేయాలి.
- అనంతరం మీరు TDR ఫైల్ చేసుకోవాలనుకున్న PNR నంబర్‌ను, పేరును సెలక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత ఫైల్ TDR ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- TDR ఫైల్ చేసేందుకు కావాల్సిన కారణాన్ని సెలక్ట్ చేసుకుని ప్రక్రియను పూర్తి చేయాలి.
- అప్పుడు.. మీ వినతి సంబంధిత రైల్వే జోనల్ కార్యాలయానికి చేరుతుంది.
- అక్కడ పరిశీలించిన అనంతరం.. మీ రీఫండ్ మొత్తాన్ని 45 రోజులలోపు మీ ఖాతాలోకి ఐఆర్‌సీటీసీ జమ చేస్తుంది.
TDR ఫైల్ చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు :
- చార్టింగ్ స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన ఒక గంటలోపు మీరు TDRని ఫైల్ చేయవచ్చు.
- గంట సమయం దాటిన తర్వాత TDR ఫైల్ చేయలేరు.
- అదేవిధంగా.. వేరే స్టేషన్ నుంచి TDR ఫైల్ చేయడం ద్వారా మీరు టికెట్ వాపసు పొందలేరు.
రైలు హారన్లు 11 రకాలని మీకు తెలుసా? వాటి అర్థాలు తెలిస్తే షాకే!