ETV Bharat / bharat

గ్యాస్​ సిలిండర్​కు ఎక్స్​పైరీ డేట్​- ఎలా చెక్​ చేయాలో తెలుసా?

How to Check LPG Cylinder Expiry Date: మనం ఉపయోగించే ప్రతీ వస్తువుకు ఎక్స్​పైరీ డేట్​ ఉంటుంది. అంతే కాకుండా నిత్యం వాడే వంట గ్యాస్​ సిలిండర్​కు కూడా గడువు తేదీ ఉంటుంది. ఆ విషయం చాలా మందికి తెలియదు. మరి దానిని ఎలా చెక్​ చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

How_to_Check_LPG_Cylinder_Expiry_Date
How_to_Check_LPG_Cylinder_Expiry_Date
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2023, 10:52 AM IST

How to Check LPG Cylinder Expiry Date in Telugu: చాలా వస్తువులను.. ఎక్స్​పైరీ డేట్​ చూసే కొంటాము. కానీ కొన్ని వస్తువుల విషయంలో ఎక్స్​పైరీ డేట్​ను పట్టించుకోము. సంవత్సరాల తరబడి ఉపయోగిస్తూనే ఉంటాము. లేదా ఆ వస్తువు పనైపోయేంత వరకు వినియోగిస్తుంటాము. వీటిల్లో గ్యాస్​ సిలిండర్​ ఒకటి. కానీ.. గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ డేట్​ ఉంటుందని మీకు తెలుసా? నమ్మలేకపోతున్నారా! ఇది నిజం. మనం వంటకు వాడే ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​కి కూడా ఎక్స్​పైరీ తేదీ అనేది ఉంటుంది. దానిని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

సిలిండర్ గడువు తేదీ ఎక్కడ ఉంటుంది: సిలిండర్ కొనుగోలు చేసేటప్పుడు.. చాలా మంది మొదట సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతుందో లేదో తనిఖీ చేస్తారు. ఇది కాకుండా, దాని బరువును కూడా తనిఖీ చేస్తారు. కానీ సిలిండర్ గడువు తేదీని ఎప్పుడూ చూడరు. సిలిండర్​పైన ఎక్స్​పైరీ డేట్​ ఎక్కడ ఉంటుందంటే.. ప్రతీ సిలిండర్ ​పై భాగంలో పట్టుకునేందుకు గుండ్రటి హ్యాండిల్ ఉంటుంది. దానికి, సిలిండర్‌కు సపోర్టెడ్‌గా మూడు ప్లేట్స్ ఉంటాయి. ఈ ప్లేట్లపై లోపలి వైపు అంకెలు వేసి ఉండడాన్ని మీరు గమనించవచ్చు. ఈ మూడింటిలో ఒక దానిపై ఆ సిలిండర్ ఎక్స్ పయిరీ తేదీ ఉంటుంది. దీనిపై సంవత్సరం, నెల వివరాలు ఉంటాయి. అది ఒకటి అక్షరం, ఒకటి అంకెల రూపంలో ఉంటుంది. ఉదాహరణకు A-12, B-23, C-15, D-28

LPG Gas Cylinder Price Hike : ఎల్​పీజీ గ్యాస్​ వినియోగదారులకు షాక్​​.. భారీగా పెరిగిన సిలిండర్​ ధరలు!

ABCD అంటే ఏమిటి?: ఈ కోడ్‌లో అక్షరాలు నెలలను సూచిస్తాయి. ABCDని ఒక్కొక్కటి మూడు నెలలుగా విభజించారు. అందులో

  • A అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి.
  • B అంటే ఏప్రిల్, మే, జూన్.
  • Cి అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్.
  • D అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్.

ఇప్పుడు మీ సిలిండర్‌పై A-24 అని రాసి ఉంటే, మీ సిలిండర్ గడువు 2024 సంవత్సరంలో జనవరి నుంచి మార్చి మధ్య ముగుస్తుందని అర్థం. D-27 అని వ్రాసినట్లయితే, 2027 సంవత్సరంలో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య సిలిండర్ గడువు ముగుస్తుందని అర్థం. ఈ విధంగా మీరు మీ సిలిండర్‌ గడువు తేదీని తెలుసుకోవచ్చు.

11.5 కోట్ల పాన్ కార్డ్స్ కట్ - అందులో మీది ఉందా? చెక్ చేసుకోండిలా!

గడువు తేదీ ఎందుకు రాస్తారు: సిలిండర్‌పై రాసిన ఈ తేదీ టెస్టింగ్​ డేట్​. దీని అర్థం ఏమిటంటే.. ఈ తేదీన సిలిండర్ పరీక్ష కోసం పంపిస్తారు. సిలిండర్ తదుపరి ఉపయోగం కోసం సరిపోతుందో లేదో చెక్​ చేస్తారు. పరీక్ష సమయంలో.. ప్రమాణాలకు అనుగుణంగా లేని సిలిండర్లు ఉపయోగించరు.

సిలిండర్​ జీవిత కాలం ఎంత?: సాధారణంగా LPG గ్యాస్ సిలిండర్ జీవితకాలం 15 సంవత్సరాలు. సిలిండర్​ను రెండుసార్లు పరీక్ష చేస్తారు.

How to Find If Festive Offers are Fake Or Real ? : ఆన్​లైన్ ఫెస్టివల్​ ఆఫర్​లో షాపింగ్ చేస్తున్నారా..? ఒక్క నిమిషం బాస్.. కొంపలు మునిగిపోతాయ్..!

How to Activate DND in Mobile Networks : స్పామ్ కాల్స్ వేధిస్తున్నాయా..? వాటి నోరు మూసేయండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.