How to Check India Post GDS Results 2023 : ఇండియా పోస్ట్‌లో కొలువు సాధించేందుకు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. భారత పోస్ట్ జులైలో నిర్వహించిన గ్రామీణ్ డాక్ సేవక్(GDS) రెండో రిక్రూట్మెంట్ డ్రైవ్‌లో భాగంగా 2023 జులైలో దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధించిన ఫలితాలను విడుదల అయ్యాయి. సదరు పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తపాలా అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి తమ రిజల్ట్స్( India Post Result 2023 )ను పీడీఎఫ్ ఫార్మాట్లో డౌన్‌లోన్ చేసుకోవచ్చు.
India Post GDS Recruitment 2023 : ఇండియా పోస్ట్ GDS 2023 నియామక ప్రక్రియకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గతనెల ముగిసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎటువంటి రాతపరీక్షను నిర్వహించలేదు. పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశారు. కాగా, ఈ ప్రక్రియ ద్వారా మొత్తం 30,041 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
అధికారిక వెబ్సైట్!
India Post Website : ఫలితాల కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ indiapostgdsonline.gov.inను వీక్షించవచ్చు.
ఒక్క క్లిక్‌తో మీ రిజల్ట్స్!
How To Check GDS Result 2023 :
- ముందుగా indiapostgdsonline.gov.in పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
- తర్వాత GDS 2023 Schedule-II, Shortlisted Candidates పక్కన '+' సింబల్‌పై క్లిక్ చేయండి.
- ఇక్కడ మీకు రాష్ట్రాల జాబితా కనిపిస్తుంది. సంబంధిత రాష్ట్రం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్‌పై క్లిక్ చేస్తే 'List Of Shortlisted Candidates' అని చూపిస్తుంది.
- చివరగా దానిపై క్లిక్ చేస్తే ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల జాబితాను మీరు చూడవచ్చు.
- మీ రిజిస్ట్రేషన్ నంబర్ సాయంతో మీ రిజల్ట్‌ను చెక్ చేసుకోవచ్చు.
సెప్టెంబర్ 16 లాస్ట్‌డేట్!
How To Check Postal Results : షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులు తమకు నిర్దేశించిన డివిజనల్ హెడ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ అధికారులు మీ డాక్యుమెంట్స్‌ను వెరిఫై చేస్తారు. కాగా, దీనికి సెప్టెంబర్ 16ను చివరితేదీగా ఫిక్స్ చేశారు. ఇక GDS పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు రిపోర్టింగ్‌కు వెళ్లేముందు అన్ని ఓరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తీసుకెళ్లండి( How To Check GDS Merit List 2023 ).
తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని ఖాళీలు!
GDS Posts in Telangana : దేశవ్యాప్తంగా మొత్తం 30,041 పోస్టులు ఉండగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌లో 1058, తెలంగాణలో 961 పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు రోజుకు 4 గంటలు పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన వారికి.. ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకుకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్స్ ఇస్తారు. రోజువారీ కార్యకలాపాల కోసం ల్యాప్‌టాప్/ కంప్యూటర్/ స్మార్ట్‌ఫోన్ లాంటివి తపాలా శాఖనే సమకూరుస్తుంది. ఎంపికైన అభ్యర్థులు సంబంధిత కార్యాలయానికి దగ్గర్లో నివాసం ఉండాలి.