ETV Bharat / bharat

How to Book Sabarimala Online Darshan Tickets 2023 : శబరిమల దర్శనం టికెట్లు ఆన్​లైన్లో.. ఇలా బుక్ చేసుకోండి..! - శబరిమల క్యూ లైన్ టికెట్లు 2023 బుకింగ్ తేదీలు

How to Book Sabarimala Online Darshan Tickets 2023 : మీరు ఈ ఏడాది శబరిమల పర్యటనకు వెళ్లాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. సీజన్‌ ఆన్​లైన్ టికెట్ బుకింగ్ డేట్స్ వచ్చేశాయి. ఆలస్యం చేయకుండా వెంటనే ఇలా ఆన్​లైన్​లో దర్శనం టికెట్లు బుక్ చేసుకోండి.

Sabarimala Online Darshan Tickets
How to Book Sabarimala Online Darshan Tickets 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 10:53 AM IST

Sabarimala Online Darshan Tickets Booking in Telugu : దక్షిణ భారతదేశంలోని కేరళ పతనంతిట్ట జిల్లాలోని పెరియార్ టైగర్ రిజర్వ్​ లోపల అభయారణ్యంలో కొలువై ఉన్న శబరిమల మణికంఠ స్వామి యాత్ర ఏటా దివ్య మనోహరంగా సాగుతుంది. పంబా నది తీరాన శబరిగిరుల్లో వెలిసిన అయ్యప్ప స్వామి దర్శనం కోసం ప్రతి సంవత్సరం లక్షలాదిమంది భక్తులు తరలి వెళ్తుంటారు. నవంబర్ నుంచి జనవరి మధ్య కాలంలో(మండలం-మకరవిళక్కు సీజన్‌) శబరిమల(Sabarimala Ayyappa Temple)కు వెళ్లే భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఈ క్రమంలో ఏటా పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కేరళ ప్రభుత్వంతో కలిసి ట్రావెన్​కోర్ దేవస్థానం బోర్డు(Travancore Devaswom Board) ఆన్​లైన్ టికెట్ బుకింగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

Sabarimala Q Line Ticket Booking 2023 : దాంతో ముందుగానే క్యూ/ప్రసాదాలు/పూజ/వసతి/కనిక్క వంటి సేవలను బుక్ చేసుకోవచ్చు. "ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్" ప్రాతిపదికన ఆన్​లైన్​లో యాత్రికులకు టికెట్లు జారీ చేస్తారు. ఈ క్రమంలో తాజాగా 2023 ఏడాదికి సంబంధించిన షెడ్యూల్​ విడుదల అయింది. అయితే.. మీరు ఈ ఏడాది శబరిమల వెళ్లాలనుకుంటే ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని ప్రశాంతంగా శబరిగిరీశుడిని దర్శించుకోండి. ఇంతకీ.. ఎప్పటి నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి? ఎలా బుక్ చేసుకోవాలి? వంటి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఈ ఏడాది మండలం-మకరవిళక్కు సీజన్​లో శబరిమల వెళ్లే భక్తులు తప్పనిసరిగా ఆన్​లైన్​లో టికెట్ బుక్ చేసుకోవాలి. అయితే.. మంత్లీ పూజ(తులం) టికెట్లు అక్టోబర్ 17 నుంచి 22 వరకు అందుబాటులో ఉండనున్నాయి. అలాగే Sree Chithira Attathirunnal ఆన్​లైన్ టికెట్లు నవంబర్ 10 నుంచి 11 వరకు, మండల పూజ మహోత్సవం టికెట్లు నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27 వరకు భక్తులు బుకింగ్ చేసుకోవచ్చు. శబరిమల వెళ్లే భక్తులు తాము దర్శించుకునే రోజు, సమయం వంటి వివరాలతో ఈ వర్చువల్ క్యూలైన్ బుకింగ్ చేసుకోవాలి.

శబరిమల ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్ కోసం అవసరమైన పత్రాలు

  • శబరిమల అయ్యప్పను సందర్శించాలనుకునే వ్యక్తి గుర్తింపు కార్డు
  • ఫొటోగ్రాఫ్
  • ఫోన్ నంబర్
  • ఈ-మెయిల్

శబరిమల Q ఆన్‌లైన్ బుకింగ్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు..

  • అయ్యప్ప భక్తులు అధికారిక వెబ్‌సైట్‌లో శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్‌ను పూర్తి చేస్తే వార్షిక తీర్థయాత్రకు హాజరుకావచ్చు.
  • మీరు తీర్థయాత్రలో ప్రయాణించి, ప్రసాదాలు, పూజ, కణిక, వసతిని యాక్సెస్ చేస్తే వర్చువల్ Q వద్ద నమోదు చేసుకోవడం తప్పనిసరి.
  • ముందుగా మీరు చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్, ఈ మెయిల్ IDతో సైన్ అప్ చేయాలి.
  • ఒకవేళ మీరు ఇప్పటికే సభ్యులు అయితే డైరెక్ట్​గా యూజర్ ఐడీ, పాస్​వర్డ్​తో లాగిన్ అవ్వాలి.
  • మండల మకరవిళక్కు తీర్థయాత్ర కోసం వర్చువల్ Q కూపన్‌లు అధికారిక సైట్ ద్వారా మాత్రమే లభిస్తాయి.
  • TDB లేదా కేరళ పోలీసులు ఏర్పాటు చేసిన ఇన్ఫర్మేషన్ కౌంటర్లతో పాటు ఏ థర్డ్-పార్టీ ఏజెంట్లు టిక్కెట్లను విక్రయించవు.

How to Book Rooms in Sabarimala : మీరు శబరిమల వెళ్తున్నారా.. రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా?

శబరిమల ఆన్‌లైన్ దర్శనం టికెట్ బుకింగ్ 2023 నమోదు ప్రక్రియ :

  • మొదట శబరిమల అధికారిక వెబ్‌సైట్ https://www.sabarimalaonline.org. ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత లాగిన్ లేదా రిజిస్ట్రేషన్ ఆప్షన్‌ను ఎన్నుకోవాలి. అప్పుడు లాగిన్ లేదా సైన్ అప్ అనే ఆప్షన్‌లో ఒకటి సెలక్ట్ చేసుకోవాలి.
  • అయితే మీరు ఇంతకుముందే ఎన్‌రోల్ అయి ఉంటే మెంబర్ లాగిన్‌ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి.
  • ఒకవేళ కొత్తగా రిజిస్ట్రర్ చేసుకోవాలంటే సైన్ అప్ ఆప్షన్‌ను ఎన్నుకొని అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
  • ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మొబైల్ నంబర్, ఐడీ ప్రూఫ్, ఐడీ నంబర్ ఎంటర్ చేయాలి. అలాగే యూజర్ నేమ్, అడ్రస్ ఇచ్చి పాస్‌వర్డ్ పెట్టుకోవాలి.
  • ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త పాస్‌వర్డ్ ఆటోమేటిక్‌గా క్రియేట్ అవుతుంది.
  • ఆ తర్వాత శబరిమల అయ్యప్పస్వామి ఆన్‌లైన్ సేవల కోసం కొత్త పాస్‌వర్డ్, యూజర్ నేమ్.. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్‌కు వస్తుంది.
  • అనంతరం మీ కొత్త లాగిన్ వివరాలతో శబరిమల ఆన్‌లైన్ దర్శన టికెట్లను సింపుల్​గా బుక్ చేసుకోవచ్చు.

శబరిమల వెళ్తున్నారా.. అయితే ఇది మీకోసమే..!

How to Change or Reset Sabarimala Login Id and Password in Online :

శబరిమల లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ మర్చిపోతే ఎలా?

  • మొదట మీరు శబరిమల అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. ఆ తర్వాత Forget or Lost password ఆప్షన్​ను ఎంచుకోవాలి.
  • అప్పుడు మీరు గతంలో ఇచ్చిన ఈ-మెయిల్ అడ్రస్​కు.. పాత పాస్‌వర్డ్‌ వస్తుంది.
  • ఆ పాత పాస్‌వర్డ్‌ను నమోదు చేసి.. దానికింద ఇచ్చిన కాలమ్​లో.. కొత్త పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
  • చివరగా apply బటన్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ మొబైల్ నంబర్​కు ఒక కోడ్​ వస్తుంది.
  • దాన్ని ధృవీకరిస్తే.. ఈజీగా కొత్త ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతుంది.
  • ఇప్పుడు కొత్త పాస్​ వర్డ్​తో శబరిమల ఆన్​లైన్ దర్శనం టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు.
  • మీ బుకింగ్ పూర్తయిన తర్వాత, కన్ఫర్మ్ అయినట్లు మీకు ఆటోమేటెడ్ SMS వస్తుంది.
  • దాంతో మీరు దర్శనం కోసం కేటాయించిన తేదీ, సమయం వివరాలతో కూడిన బార్‌కోడ్ ఈ–టిక్కెట్ల (e-tickets)ను డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. ఆ టికెట్లు కచ్చితంగా మీ వెంట ఉండాలి.

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా శబరిగిరీశునికి కానుకలు

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్​ న్యూస్.. ఇకపై విమానాల్లోనూ ఇరుముడి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.