ETV Bharat / bharat

How to Book General Tickets by UTS App: క్యూ లైన్లకు చెక్​.. యూటీఎస్​ ద్వారా సులభంగా జనరల్​ టికెట్​.. బుకింగ్​ ఎలాగంటే..?

How to Book Railway Tickets by UTS App: రైల్వే ప్రయాణీకులకు గుడ్​న్యూస్​. ఇక నుంచి జనరల్ టికెట్ల కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిలుచోవల్సిన అవసరం లేదు. రైల్వేశాఖ ప్రవేశపెట్టిన ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనే టికెట్ తీసుకోవచ్చు. మరి అది ఎలానో ఈ స్టోరీలో వివరంగా తెలుసుకుందాం..

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 30, 2023, 1:18 PM IST

Updated : Oct 30, 2023, 2:07 PM IST

How to Book General Railway Tickets by UTS App: భారతదేశంలో రైళ్లు ఎప్పుడూ ప్రయాణీకులతో కిటకిటలాడతాయి. అప్పటికప్పుడు ప్రయాణాలు చేయాల్సినప్పుడు లేదా షార్ట్ డిస్టెన్స్ ప్రయాణాలకు అందరూ జనరల్ టికెట్లపైనే ఆధారపడుతుంటారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రయాణికులకు అందుబాటులో ఉండే జనరల్‌ బోగీలు నిత్యం రద్దీగానే కనిపిస్తాయి. సీజన్ సమయంలో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. జనరల్ టికెట్ కోసం క్యూలైన్లలో నిలుచోవాల్సిన పరిస్థితి ఉంటుంది. రైలు బయలుదేరడానికి ముందే స్టేషన్‌కి చేరుకోవడం.. గంటల తరబడి క్యూలో నిలబడటం వంటి తిప్పలు తప్పవు. ఇప్పుడు ఈ ఇక్కట్లను భారతీయ రైల్వే శాఖ దూరం చేస్తోంది. ఆన్‌లైన్‌లోనే యూటీఎస్​ యాప్​ ద్వారా జనరల్​ టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. మరి అది ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం..

యూటీఎస్ అంటే అన్ రిజర్వ్​డ్ టికెటింగ్ సిస్టమ్(Unreserved Ticketing System). ఈ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో జనరల్ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి ఈ యాప్ ప్రవేశపెట్టి చాలా రోజులు దాటినా పెద్దగా ప్రాచుర్యంలో లేదు. ఇప్పుడిప్పుడే రైల్వే శాఖ ఈ యాప్ గురించి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తోంది. ఈ అప్లికేషన్‌ సాయంతో ఫోన్‌లోనే జనరల్‌ టికెట్లు, నెలవారీ సీజనల్‌ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు బుక్‌ చేయొచ్చు.

Train Ticket Transfer Process : రైలు ప్రయాణం వాయిదా పడిందా?.. ట్రైన్​ టికెట్​ను ఈజీగా ట్రాన్స్​ఫర్ చేసుకోండిలా?

యూటీఎస్​ యాప్​ ద్వారా జనరల్​ టికెట్​ బుకింగ్​ విధానం:

General Ticket Booking Procedure through UTS App:

  • ఆండ్రాయిడ్‌ వినియోగదారులైతే గూగుల్‌ ప్లేస్టోర్‌, ఐఫోన్‌ వినియోగదారులు యాప్‌ స్టోర్‌, విండోస్‌ ఫోన్‌లు వాడేవారు విండోస్‌ యాప్‌ స్టోర్‌ నుంచి యూటీఎస్(UTS) అప్లికేషన్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.
  • అనంతరం ఫోన్‌ నంబర్‌, పేరు, పాస్‌వర్డ్‌, పుట్టిన తేదీ తదితర వివరాలతో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ఆ వెంటనే వన్‌టైం పాస్‌వర్డ్‌ (OTP) వస్తుంది. దాన్ని నమోదు చేయడంతో ఈ ప్రక్రియ ముగుస్తుంది.
  • రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఫోన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో మన అకౌంట్‌లోకి లాగిన్‌ అవ్వాలి.
  • ఆ తర్వాత టికెట్‌ బుకింగ్‌ కోసం Normal Booking’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఆన్‌లైన్‌ టికెట్‌ కావాలనుకుంటే బుక్‌ అండ్‌ ట్రావెల్‌ (పేపర్‌లెస్‌), ప్రింటెడ్‌ టికెట్‌ కావాలనుకుంటే బుక్‌ అండ్‌ ప్రింట్(పేపర్‌) ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • అనంతరం మనం ఎక్కాల్సిన, దిగాల్సిన స్టేషన్‌ల వివరాలు నమోదు చేయాలి. ఆపై ప్రయాణికుల (పెద్దలు, చిన్నారులు) సంఖ్య, ట్రైన్‌ టైప్‌, ఏ క్లాస్‌(రెండో క్లాస్‌, అన్‌రిజర్వ్‌డ్‌) వివరాలు పొందుపర్చాలి.
  • తర్వాత నగదు చెల్లింపు కోసం ‘పేమెంట్‌ టైప్‌’లో ఆర్‌-వ్యాలెట్‌ లేదా ఇతర ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థలను ఎంచుకోవాలి. టికెట్‌లకు ఎంతవుతుందో తెలుసుకుని, చివరకు 'Book Ticket' ఆప్షన్​’పై క్లిక్‌ చేయాలి. దీంతో టికెట్‌ బుక్‌ అవుతుంది.
  • టికెట్‌ చూడాలనుకుంటే 'Show Ticket' ‘ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే మీరు బుక్‌ చేసుకున్న టికెట్‌ వివరాలు కనిపిస్తాయి. View Ticket పై ‘క్లిక్‌ చేస్తే.. టికెట్‌ కనిపిస్తుంది.
  • ‘క్విక్‌ బుకింగ్‌’ ఆప్షన్‌ ద్వారా ఇది వరకు బుక్‌ చేసుకున్న టికెట్‌ల వివరాలు కనిపిస్తాయి. ‘ప్లాట్‌ఫాం బుకింగ్‌’ ద్వారా ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకోవచ్చు.
  • ‘సీజనల్‌ టికెట్స్‌’తో కొత్తగా నెలవారీ టికెట్‌ తీసుకోవచ్చు. రెన్యూవల్‌ కూడా చేసుకోవచ్చు.
  • ‘క్యూఆర్‌ బుకింగ్‌’ ఆప్షన్‌ ద్వారా.. స్టేషన్‌లోని టికెట్‌ కౌంటర్ల వద్ద క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా టికెట్‌ పొందవచ్చు.

How to get Discounts on Train Tickets : రైలు టికెట్లు డిస్కౌంట్లో కావాలా నాయనా..? ఇలా చేయండి​!

అయితే టికెట్​ బుకింగ్​ సమయంలో కొన్ని సూచనలు పాటించాల్సిందే. ఆ వివరాలు..

  • టికెట్‌ కోసం చెల్లింపులకు ఆర్‌-వ్యాలెట్‌ ఆప్షన్‌ను ఎంచుకునే వారు ముందుగా.. దాన్ని రీఛార్జ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రూ.100 ఆపై మాత్రమే రీఛార్జ్‌ సాధ్యపడుతుంది. ఆన్‌లైన్‌లో లేదా, స్టేషన్‌లోని యూటీఎస్‌ కౌంటర్‌ వద్ద రీఛార్జ్‌ చేసుకోవచ్చు.
  • ఫోన్‌లో టికెట్‌ బుకింగ్‌ కోసం ఇంటర్నెట్‌ సదుపాయం తప్పనిసరి. జీపీఎస్‌ను యాక్టివేట్‌ చేసుకోవాలి. ప్రయాణించే రోజు మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకోగలం. టికెట్‌ తీసుకున్న గంటలోపు రైలెక్కాలి.
  • ఎంపిక చేసిన స్టేషన్‌లలో మాత్రమే ప్లాట్‌ఫాం టికెట్‌ తీసుకోగలం.
  • పేపర్‌లెస్‌ టికెట్‌ రద్దు చేయడం కుదరదు. స్టేషన్‌ వెలుపల 5 కి.మీల పరిధిలో మాత్రమే టికెట్‌ తీసుకోవచ్చు. స్టేషన్‌ లోపల, రైల్లో ఉన్నప్పుడు కుదరదు.
  • పేపర్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు స్టేషన్‌కు వెళ్లి అక్కడి ఏటీవీఎం/ కో-టీవీఎం, ఓసీఆర్‌ యంత్రాలు, ఓటీఎస్‌ బుకింగ్‌ కౌంటర్‌ నుంచి టికెట్‌ ప్రింట్‌ తీసుకోవచ్చు. ఇందుకోసం ఫోన్‌ నంబర్‌, బుకింగ్‌ ఐడీ నంబర్‌ ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. టికెట్‌ రద్దూ చేసుకోవచ్చు. ఈ విధానంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు కచ్చితంగా చేతిలో టికెట్‌ కలిగి ఉండాలి. లేనిపక్షంలో జరిమానా పడుతుంది.
  • టికెట్‌ పొందడంలో సమస్యలు, ఇతర ఇబ్బందులపై ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్‌లోనే రైల్వే కస్టమర్‌ కేర్‌ నంబర్లు, ఫిర్యాదుల స్వీకరణ అప్షన్‌ కూడా ఉన్నాయి.

Best 5 Train Ticket Booking Apps : ఆన్​లైన్​లో ట్రైన్ టికెట్స్.. బెస్ట్ యాప్స్ ఇవే!

How to Book IRCTC Tatkal Tickets : తత్కాల్ టికెట్లు.. ఎలా బుక్ చేయాలో తెలుసా..?

How to Cancel IRCTC Train Tickets Online : ఐఆర్​సీటీసీలో.. ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోవడం ఎలా..?

Last Updated : Oct 30, 2023, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.