How to be Always Liked by Everyone : ప్రతి ఒక్కరూ తనను ఇష్టపడాలని అందరూ కోరుకుంటారు. తనను ప్రేమించాలని, తనతో అందరూ మంచిగా ఉండాలని భావిస్తారు. అయితే.. అలా కోరుకోగానే ఇలా జరిగిపోయేది కాదది. కానీ.. కొందరు మాత్రం తమ వ్యక్తిత్వం(Personality)తో అందరి మన్ననలు పొందుతూ అందరూ ఇష్టపడే వారిగా నిలుస్తుంటారు. వారికి ఎలా సాధ్యమైందో ఇతరులకు అర్థం కాదు. మీరు కూడా అలా కావాలంటే.. కొన్ని లక్షణాలు మీలో తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మీరు అందరిలో మంచి ఆదరణాభిమానాలు పొంది పాపులర్ పర్సన్ గా నిలుస్తారు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
నమ్మకం : మీరు అందరూ ఇష్టపడే వ్యక్తిగా నిలువాలంటే ముందుగా ఉండాల్సిన ప్రధాన లక్షణం.. నమ్మకం. ఇది చాలా అవసరం. జనం నమ్మకమైన వారి వైపే ఎక్కువ ఆకర్షితులవుతారు. కాబట్టి మీరు నిజాయితీగా ఉండడం అవసరం. మీ నిజాయితీయే మీపై నమ్మకాన్ని పెంచుతుంది.
శ్రద్ధగా వినండి : మీరు లవబుల్ పర్సన్ గా మారాలంటే మీలో ఉండాల్సిన మరో అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. చురుకుగా వినడం. అవతలి వారుచెప్పేది శ్రద్ధగా వినండి. ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు.. వారి మీదనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించాలి. ఐ కాంటాక్ట్ మెయింటెయిన్ చేయండి. దీనివల్ల వారి విషయం పట్ల మీరు శ్రద్ద చూపుతున్నారని వారికి అర్థమవుతంది. మీపై గౌరవం పెరుగుతుంది.
సానుభూతి : ఇతరుల సమస్యల పట్ల సానుభూతి చూపండి. వీలైతే సహాయం చేయండి. ఈ బిహేవియర్.. చక్కటి బంధాలను సృష్టిస్తుంది. మీ చుట్టూ ఉన్నవారి శ్రేయస్సు గురించి మీరు ఆలోచిస్తున్నారని వారికి అర్థమవుతుంది. వారికి అవసరమైనప్పుడు కొంత టైమ్ కేటాయించండి. ఇలా చేయడం వల్ల మీపై కృతజ్ఞతా భావం పెరుగుతుంది.
ఏళ్లనాటి మైగ్రేన్ బాధలు - ఇలా తిండితోనే తగ్గించుకోవచ్చు!
పాజిటివిటీ : ఆశావాదం చాలా ముఖ్యమైన విషయం. అది మీ జీవితాన్ని పాజిటివ్ కోణంలో ముందుకు నడిపించడమే కాదు.. మీ చుట్టూ ఉన్న వాు కూడా మీ పట్ల ఆకర్షితులయ్యేలా చేస్తుంది. నెగెటివ్ విషయాల గురించి మాట్లాడడం.. ఇతరులపై కంప్లైంట్ చేయడం వంటివి మానుకోండి. మూడో వ్యక్తి గురించి చెడుగా చెప్పడం కూడా మీపై గౌరవాన్ని తగ్గిస్తుంది. ఇలాంటివి వదిలేసి.. పాజిటివ్ గా ఉండండి. తద్వారా.. మీ చుట్టూ మంచి వాతావరణం ఏర్పడుతుంది. అందులో భాగం కావడానికి పక్కవారూ ఆసక్తిచూపుతారు.
బాడీ లాంగ్వేజ్ : మీరు అందరిలో పాపులారిటీ పొందాలంటే మీ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉండాలి. దీనిపై శ్రద్ధ పెట్టాలి. తక్కువ సమయంలో ఎక్కువ మందిని ఎట్రాక్ట్ చేయాలంటే ఇది చాలా కీలకం. ఐ కాంటాక్ట్ చేస్తూ మాట్లాడండి. చక్కగా వినండి. స్పష్టంగా మాట్లాడండి. మంచిగా డ్రెస్ చేసుకోండి. ఇవన్నీ చాలా ముఖ్యం.
సెన్స్ ఆఫ్ హ్యూమర్ : నవ్వు అనేది అత్యద్భుతమైన విషయం. కాబట్టి ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండండి.
మంచి హాస్యం వ్యక్తుల మధ్య బంధాలను నిర్మించడంలో శక్తివంతమైన సాధనం. రోజువారీ పనుల్లోనే ఆనందాన్ని వెతుక్కుంటూ.. అవతలివారిని సంతోషపరచాలి. ఇలాంటివారిని ఎక్కువ మంది ఇష్టపడతారు.
కృతజ్ఞత : కృతజ్ఞత అనేది చాలా ఇంపార్టెంట్. అనుబంధాన్ని పెంపొందించే శక్తివంతమైన భావోద్వేగం. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు థాంక్స్ చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండండి. వారిని ప్రశంసించడానికి కూడా ముందుండండి. ఈ ప్రవర్తన.. మీపై గౌరవాన్ని, ఇష్టాన్ని పెంచుతుంది. సంబంధాలను బలోపేతం చేస్తుంది.
ఇవన్నీ చేస్తూ.. మీ పనిలో మీరు నిత్య విద్యార్థిలా ఉండండి. మీ డెవలప్ మెంట్ పై దృష్టిపెట్టండి. అప్పుడు ఆటోమేటిగ్గా పక్కన ఉన్నవాళ్లంతా మిమ్మల్ని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. మీపై ప్రేమ, గౌరవం పెంచుకుంటారు..
మీ శరీరం ఈ హెచ్చరికలు చేస్తోందా? - అయితే మీరు డేంజర్లో ఉన్నట్టే!
ఈ లక్షణాలు మీ బాడీలో కనిపిస్తున్నాయా?- అయితే మీకు టైప్ 2 డయాబెటిస్ ఉన్నట్లే! జాగ్రత్త సుమా!!