How to Get SBI Mudra Loan : చేస్తున్న ఉద్యోగం కన్నా.. బిజినెస్ మీదనే ఆసక్తి ఉంటుంది కొందరికి! ఎలాంటి జాబ్ లేని వారు కూడా.. ఏదైనా చిన్నపాటి వ్యాపారం చేసుకుంటే బాగుండు అనుకుంటారు. కానీ.. డబ్బు సమస్య వారిని ముదుకు అడుగు వేయనీయదు. ఇలాంటి వారి లిస్టులో మీరున్నారా..? అయితే.. మీకోసమే ఎస్బీఐ ముద్ర లోన్ (SBI Mudra Loan) అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కీం ద్వారా.. తక్షణమే 50 వేల నుంచి 10 లక్షల దాకా రుణం పొందే సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇది కూడా ఎలాంటి హామీ పత్రాలు లేకుండానే అందిస్తోంది. మరి, ఆ రుణం ఎలా పొందాలి? ఇందుకోసం ఎలాంటి డాక్యుమెంట్లు సమర్పించాలి? ఎలా దరఖాస్తు చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ముద్ర లోన్ పొందడానికి అర్హతలు..
- SBI ముద్ర లోన్ కోసం అప్లై చేయాలనుకునే వారికి.. ఖచ్చితంగా SBIలో అకౌంట్ ఉండాలి.
- దరఖాస్తుదారు.. SBIలో ఖాతా (కరెంట్ లేదా సేవింగ్స్) తెరిచి కనీసం 6 నెలలై ఉండాలి.
- లోన్ పొందాలనుకునేవారు.. తయారీ లేదా సేవల రంగంలో పనిచేస్తూ ఉండాలి.
- దరఖాస్తుదారు ఇప్పుడు ఉంటున్న ఇంట్లో.. కనీసం రెండేళ్లుగా నివసిస్తూ ఉండాలి.
How to Participate PNB E-Auction 2023 : అతి తక్కువ ధరకు ఇల్లు కావాలా..? బ్యాంకు వేలం వేస్తోంది..!
ముద్ర లోన్ కోసం ఏం పత్రాలు కావాలి?
- లోన్ కావాలనుకునే వ్యక్తి ఆధార్ కార్డు
- నివాస ధ్రువీకరణ పత్రం
- కుల ధ్రువీకరణ పత్రం
- GST రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
- వ్యాపార స్థాపన సర్టిఫికేట్
- పూర్తిచేసిన దరఖాస్తు ఫామ్ పై పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
ఎంత రుణం ఇస్తారు..?
- ముద్ర లోన్ దరఖాస్తు దారుకు తక్షణంగా రూ.50 వేల వరకు రుణం ఇస్తారు.
- గరిష్టంగా మాత్రం రూ.10 లక్షల వరకూ రుణం మంజూరు చేసే అవకాశం ఉంది.
- రూ.50 వేల లోపు లోన్ కోసం దరఖాస్తు దారు ఇంట్లోనే ఉండి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
- రూ. 50 వేల కంటే ఎక్కువ లోన్ కావాల్సి వస్తే మాత్రం.. దగ్గరలోని SBI శాఖను సందర్శించి.. వివరాలు సమర్పించాల్సి ఉంటుంది.
How to Earn Money as a Student : చదువుకుంటూనే సంపాదించాలా..? ఎన్ని మార్గాలున్నాయో..!
దరఖాస్తు ఎలా చేయాలి..?
- ముద్ర రుణం కోసం దరఖాస్తు చేసేందుకు SBI అఫీషియల్ వెబ్ సైట్.. emudra.sbi.co.in లోకి ప్రవేశించాలి.
- ఇప్పుడు హోమ్ పేజీలో "ప్రొసీడ్ ఫర్ ఇ-ముద్ర" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ నిబంధనలు కనిపిస్తాయి. వాటిని జాగ్రత్తగా చదవిన తర్వాత "ఓకే" బటన్‌పై క్లిక్ చేయాలి.
- తర్వాత స్క్రీన్‌పై ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మొబైల్ నంబర్, SBI అకౌంట్ నంబర్, ఇంకా మీకు అవసరమైన రుణం మొత్తాన్ని ఎంటర్ చేయాలి.
- సమాచారం ఫిల్ చేసిన తర్వాత "Proceed" పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు స్క్రీన్‌పై వ్యక్తిగత సమాచారం నింపమని అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ నింపి, అడిగిన అర్హతా పత్రాల స్కాన్ కాపీని అప్‌లోడ్ చేయాలి.
- ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేసి, షరతులకు అంగీకరించాలి.
- ఇప్పుడు మీ మొబైల్ నంబర్ కు OTP వస్తుంది. దాన్ని ఎంటర్ చేయడంతో.. మీ ముద్ర లోన్ అప్లికేషన్ ప్రక్రియ పూర్తయిపోతుంది.
ట్విట్టర్‌తో డబ్బు సంపాదించేందుకు రెండు ఈజీ మార్గాలు.. మస్క్ బంపర్ ఆఫర్!
గవర్నమెంట్ జాబ్ వదిలేసిన యువతి.. ఆ వీడియోస్‌తో లక్షల్లో సంపాదన