How to Apply New Ration Card in Telangana : దేశంలోని దాదాపు ప్రతి వ్యక్తికి రేషన్ కార్డ్ అనేది అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటిగా చెప్పుకోవచ్చు. ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలచే జారీ చేయబడుతుంది. రేషన్ కార్డు వివరాలు వ్యక్తి గుర్తింపు, నివాసానికి సంబంధించిన ముఖ్యమైన రుజువుకు ఇది ఉపయోగపడుతుంది. అలాగే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు(Telangana Welfare schemes) పొందడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా ప్రజలు చౌకగా రేషన్ సరుకులు పొందుతారు. ఈ పథకం ద్వారా ఎవరైనా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. ఈ కార్డు పేదలకు ఎంతో మేలు చేస్తుంది. రేషన్ షాపుల్లో తక్కువ ధరకే వచ్చే సరుకులతో ఇల్లు గడుస్తోంది. అయితే అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత కింద రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది.
EPDS Telangana FSC Card Application Procedure : రేషన్ కార్డు ఉంటే.. తక్కువ ధరకే బియ్యం, గోధుమలు, చక్కెర లాంటి సరుకులను పొందవచ్చు. ఇలాంటి ప్రయోజనాలన్నీ పొందాలంటే మీరు చేయాల్సిందల్లా మీ పేరు మీద రేషన్ కార్డు(Ration Card) తీసుకోవడమే. నేటికి చాలా మంది రేషన్ కార్డులు తీసుకోని వారు ఉన్నారు. అలాగే కొత్తగా అప్లై చేసుకునే వారు గతంలో మాదిరిగా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదు. మీరు ఉన్న చోటు నుంచే సులభంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇంతకీ రేషన్ కార్డు పొందాలంటే ఏఏ పత్రాలు అవసరం, ఎలా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలో ఇప్పుడు ఈ స్టోరీలో చూద్దాం..
తెలంగాణలో రేషన్ కార్డుల రకాలు : రాష్ట్రంలో మూడు రకాల రేషన్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అంత్యోదయ ఆహార భద్రత కార్డు (AFSC), ఆహార భద్రత కార్డు (FSC), అంత్యోదయ అన్న యోజన కార్డులు అమలులో ఉన్నాయి. అయితే ఈ కార్డులను పొందాలంటే సర్కార్ కొన్ని అర్హతలను పెట్టింది. వాటి ఆధారంగా ఎవరు ఏ కార్డుకు అర్హత పొందితే ఆ రేషన్ కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తుంది.
తెలంగాణ రేషన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయడానికి అర్హత ప్రమాణాలివే..
Eligibility Criteria for New Ration Card in Telangana :
- అభ్యర్థి తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర పౌరుడై ఉండాలి.
- కొత్త అప్లై చేసే అభ్యర్థి రాష్ట్రంలోని ఎలాంటి రేషన్ కార్డులు కలిగి ఉండకూడదు.
- దరఖాస్తుదారు సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గానికి (EWS) చెందినవారై ఉండాలి.
- పాత రేషన్ కార్డులు (గడువు ముగిసిన కార్డులు) ఉన్న అభ్యర్థి కొత్తదానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Required Documents for New Ration Card :
దరఖాస్తు సమయంలో అవసరమైన పత్రాలు
- ఆధార్ కార్డు
- ఆదాయ ధ్రువీకరణ పత్రం
- కుటుంబ సభ్యుల పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు
- చిరునామా రుజువు (విద్యుత్ బిల్లు, గ్యాస్ బిల్లు, నీటి సరఫరా బిల్లు, టెలిఫోన్ బిల్లు మొదలైనవి).
- గుర్తింపు రుజువు (డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ మొదలైనవి).
- యాక్టివేట్ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ
- మీ బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ కాపీ
- గ్యాస్ కనెక్షన్ వివరాలు
రేషన్ కార్డు దరఖాస్తు కోసం అన్ని రాష్ట్రాలు వారి రాష్ట్రానికి సంబంధించి.. ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాయి. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఒక వెబ్‌సైట్‌ను తీసుకొచ్చింది. మీరు ఆ వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ కి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. అప్పుడు మీకు వచ్చే రశీదులో అప్లికేషన్ నంబర్ వస్తుంది. దాని ద్వారా EPDS తెలంగాణ పోర్టల్‌లోకి వెళ్లి మీ కార్డు స్టేటస్ సింపుల్‌గా ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. అనంతరం కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ఈపీడీఎస్ సేవలు పొందవచ్చు.
రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై బియ్యం వద్దంటే డబ్బులు!
How to Search EPDS FSC Application Online :
మీ EPDS FSC తెలంగాణ అప్లికేషన్‌ను సెర్చ్ చేయండిలా..
- మొదట మీరు ఎలక్ట్రానిక్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (EPDS) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
- అప్పుడు ప్రధాన స్క్రీన్ ఎడమ వైపు కనిపిస్తున్న 'FSC Search' అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో Ration Cards Search అనే ఆప్షన్‌పై నొక్కాలి. అప్పుడు మీకు మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి. అవి FSC Search, FSC Application Search, Status of Rejected Ration Card అనేవి వస్తాయి.
- అప్పుడు మీకు కావాల్సిన "FSC Application Search"పై క్లిక్ చేసి.. డ్రాప్-డౌన్ మెను నుంచి "జిల్లా"ని ఎంచుకోవాలి. ఆపై మీ "అప్లికేషన్ నంబర్"ని నమోదు చేయడం వంటి అవసరమైన వివరాలను నమోదు చేయాలి.
- చివరగా Search బటన్‌పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన FSC అప్లికేషన్ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
How to Check EPDS Telangana FSC Card Status Report Online :
ఆన్లైన్లో EPDS తెలంగాణ FSC కార్డ్ స్టేటస్ రిపోర్ట్ చెక్ చేసుకోండిలా..
- మొదట EPDS అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అప్పుడు హోమ్ స్క్రీన్‌లో 'Reports' ఐకాన్‌ను ఎంచుకోవాలి.
- అనంతరం ఓపెన్ అయ్యే పేజీలో "రేషన్ కార్డ్ రిపోర్ట్స్" ఐకాన్‌పై నొక్కి.. 'FSC Card Status Report' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- అప్పుడు మీ తెలంగాణ రాష్ట్ర 'FSC Ration Card Status Report' మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
How to Download EPDS Telangana FSC Card :
EPDS తెలంగాణ FSC కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..
- మొదట మీరు EPDS అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.
- అప్పుడు 'FSC సెర్చ్' అనే ఐకాన్‌పై క్లిక్ చేయాలి. తర్వాతి పేజీలో రేషన్ కార్డ్ సెర్చ్ క్రింద ఉన్న 'FSC అప్లికేషన్ సెర్చ్' అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
- ఆ తర్వాత మీరు జాబితా నుంచి "జిల్లా"ని ఎంచుకుని, "అప్లికేషన్ నంబర్" ఎంటర్ చేసి, ఆపై "Search" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- అనంతరం మీ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ లేదా రేషన్ కార్డు వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. అప్పుడు పేజీని క్రిందికి స్క్రోల్ చేసి డౌన్‌లోడ్ ఆప్షన్‌పై క్లిక్ చేసి మీ ఎఫ్ఎస్సీ కార్డును ప్రింట్ అవుట్ ద్వారా సులభంగా పొందండి.
పేరు తప్పుగా పడిందని వినూత్న నిరసన.. అధికారి ముందు కుక్కలా మొరుగుతూ..