ETV Bharat / bharat

How to Apply for One Nation One Ration Card : ఈ కార్డు ద్వారా ఎక్కడి నుంచైనా రేషన్ పొందవచ్చు.. ఇప్పుడే అప్లై చేసుకోండి..! - వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ప్రయోజనాలు

How to Apply One Nation One Ration Card in Telugu : కేంద్ర ప్రభుత్వం 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డు' వ్యవస్థను తెచ్చింది. దీని ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంది. అయితే.. మీకు ఇంకా రేషన్ కార్డు లేకపోతే, మీరు సులభంగా రేషన్ కార్డును ఎలా పొందవచ్చో ఈ స్టోరీ ద్వారా తెలుసుకోండి.

One Nation One Ration Card Scheme
One Nation One Ration
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 8, 2023, 10:57 AM IST

How to Apply One Nation One Ration Card in Online : దేశ ప్రజలకు ఆధార్, పాన్​కార్డు మాదిరిగానే రేషన్​ కార్డు కూడా ఒక ముఖ్యమైన పత్రంగా మారిపోయింది. ఈ కార్డుతో సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు లభిస్తున్నాయి. ఇది ఒక గుర్తింపు కార్డుగానూ పనిచేస్తోంది. అయితే.. ఇప్పటికే కేంద్రం 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డు'(One Nation One Ration Card) వ్యవస్థను ప్రభుత్వం అమలు చేసింది. ఈ పథకం అమలు ద్వారా దేశంలో ఏ రాష్ట్రంలో నుంచైనా రేషన్ తీసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఒకవేళ మీకు కార్డు లేకపోతే.. సులభంగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు.

రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారికి విధించిన కొన్ని నిబంధనలు..

  • రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి.
  • ఇతర రాష్ట్రాలకు చెందిన రేషన్ కార్డులు ఆ వ్యక్తి వద్ద ఉండరాదు.
  • ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వయసు 18 ఏళ్లు నిండి ఉండాలి.
  • అలాగే 18 సంవత్సరాల కన్న తక్కువ వయస్సు ఉంటే.. ఆ వ్యక్తికి తల్లిదండ్రుల పేరు మీదే రేషన్ కార్డు ఇవ్వబడుతుంది.
  • కుటుంబ సభ్యులెవరికీ మరో రేషన్ కార్డులో పేరు ఉండకూడదు.

దరఖాస్తు సమయంలో ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి :

Required Documents for One Nation One Ration Card : ఓటరు ఐడి, ఆధార్ కార్డు(Aadhaar Card), పాస్‌పోర్ట్, ప్రభుత్వం జారీ చేసిన ఐ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్‌ను రేషన్ కార్డు తయారు చేయడానికి ఐడీ ప్రూఫ్‌గా ఇవ్వవచ్చు. ఇవే కాకుండా పాన్​కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఇంటి చిరునామా, గ్యాస్ కనెక్షన్ బుక్, విద్యుత్ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా పాస్‌బుక్, అద్దె ఒప్పందం వంటి పత్రాలనూ కూడా ఇవ్వవలసి ఉంటుంది.

How to Apply for One Nation One Ration Card Scheme :

వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోండిలా..

  • ముందుగా ఈ పథకం కింద రేషన్ కార్డు కలిగిన వారు మళ్లీ కొత్త రేషన్ కార్డు(New Ration Card) కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
  • "వన్ నేషన్ వన్ రేషన్" కార్డు కోసం అన్ని రాష్ట్రాలు వారి తరపున ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాయి.
  • అయితే మీరు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారో, అక్కడి వెబ్‌సైట్‌కి వెళ్లి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • అన్ని రాష్ట్రాలు లబ్ధిదారుల రేషన్ కార్డును ధృవీకరించి, ఆధార్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.
  • రేషన్‌ను తిరస్కరించే సమస్య లేకుండా ఉండేందుకు లబ్ధిదారులందరి డేటాబేస్‌ను పీడీఎస్‌తో అనుసంధానం చేస్తారు.
  • దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఏ వలస కార్మికుడు సబ్సిడీ రేషన్‌ను కోల్పోకూడదు.
  • ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల పేదలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్తుంటారు.
  • అలాంటి వారు అక్కడ కూడా రేషన్ తీసుకోవచ్చు.

Ration card Application Status in Telangana : రేషన్ కార్డు జాబితాలో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి.. దరఖాస్తు అలా..

How to Download Mera Ration Mobile App Download :

మేరా రేషన్ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండిలా..

  • NFSA రేషన్ కార్డు లబ్ధిదారుల కోసం వినియోగదారుల వ్యవహారాల శాఖతో కలిసి NIC ద్వారా మొబైల్ అప్లికేషన్‌ను అభివృద్ధి చేసింది.
  • ముందుగా మీ మొబైల్ ఫోన్​లో గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయాలి.
  • ఆ తర్వాత మేరా రేషన్ యాప్ కోసం సెర్చ్ చేయాలి.
  • ఆపై ఆ యాప్​ను డౌన్‌లోడ్ చేసి.. ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
  • ఈ యాప్ ద్వారా ఇక నుంచి ఎక్కడికీ వెళ్లకుండా మొబైల్ యాప్ నుంచి రేషన్ సంబంధిత సేవలను పొందవచ్చు.

One Nation One Ration Card Scheme Benefits in Telugu :

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు స్కీమ్ ప్రయోజనాలివే..

  • ముందుగా, దేశంలోని ఏ కుటుంబమైనా జూన్ 1, 2020 నుంచి ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.
  • ఉపాధిని వెతుక్కుంటూ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లే వ్యక్తులు వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం ద్వారా ప్రయోజనం పొందుతారు.
  • అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడు దేశంలోని ఏదైనా PDS దుకాణం నుంచి పారదర్శకతతో సులభంగా ఆహార ధాన్యాలను కొనుగోలు చేయవచ్చు.
  • వన్ నేషన్ వన్ కార్డు పథకంలో లబ్ధిదారులకు కొత్త కార్డు ఉండదు.
  • వలస కార్మికులందరూ పాత రేషన్ కార్డు ద్వారా మాత్రమే దేశంలోని ఏ ప్రాంతంలోనైనా సబ్సిడీ ఆహార ధాన్యాలకు అర్హులు.
  • కొత్త రేషన్ కార్డు పథకం అమలు తర్వాత కూడా పాత రేషన్ కార్డు కొనసాగింపు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • వన్ నేషన్ వన్ కార్డుకు సంబంధించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 14445కు కాల్ చేయవచ్చు

రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఇకపై బియ్యం వద్దంటే డబ్బులు!

'ఆధార్​ లేదని రేషన్​ కార్డులో పేర్లు తొలగించొద్దు'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.