Child Care Leave New Rules: కేంద్రం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ ముఖ్యమైన విషయాన్ని తెలియజేసింది. మహిళలు, ఒంటరి పురుష ఉద్యోగుల కోసం 7వ పే కమిషన్ ద్వారా 'చైల్డ్ కేర్ లీవ్ (Child Care Leave)'ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. చైల్డ్ కేర్ లీవ్‌కు అర్హత కలిగినవారు 730 రోజులపాటు సెలవులు తీసుకోవచ్చని వెల్లడించింది. మరి, ఈ చైల్డ్ కేర్ లీవ్ అంటే ఏమిటి..? దీనికి ఎవరు అర్హులు..? సెలవులు తీసుకున్న సమయంలో ఎంత వేతనం చెల్లిస్తారు..? అనే విషయాలను ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం.
చైల్డ్ కేర్ లీవ్ అంటే ఏమిటి..?
What is Child Care Leave: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పని చేస్తున్న మహిళలు, ఒంటరి పురుషుల కోసం శిశు సంరక్షణ సెలవుల (Child Care Leave) విధానాన్ని కేంద్రం తీసుకువచ్చింది. ఈ విధానాన్ని 'చైల్డ్ కేర్ లీవ్' గా పిలుస్తున్నారు. ఈ విధానం కింద మహిళలు, ఒంటరి పురుష ప్రభుత్వ ఉద్యోగులు 730 రోజుల సెలవులకు అర్హులు కానున్నారు. కేంద్ర వ్యవహారాలకు సంబంధించిన సివిల్ సర్వీసెస్, ఇతర విభాగాల్లో నియమితులైన మహిళా, ఒంటరి పురుష ఉద్యోగులు.. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (లీవ్) రూల్స్ 1995 ప్రకారం చైల్డ్ కేర్ లీవ్ (CCL)కి అర్హులుగా పరిగణించబడతారు.
పురుష ప్రభుత్వ ఉద్యోగులకూ చైల్డ్‌కేర్ లీవ్‌లు
ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం 730 రోజులు సెలవు
730 days leave for taking care of two children: ఆల్ ఇండియా సర్వీసెస్ (AIS)లో విధులు నిర్వర్తిస్తున్న మహిళలకు, ఒంటరి పురుషులకు శిశు సంరక్షణ సెలవుల కింద వారి మొదటి ఇద్దరు పిల్లలకు 18 ఏళ్లు వచ్చే వరకూ వారి సంరక్షణ కోసం మొత్తం సర్వీసులో గరిష్టంగా 730 రోజులు సెలవు ఇస్తారు. దివ్యాంగులైన పిల్లల విషయంలో మాత్రం వయోపరిమితి లేదు. గరిష్టంగా 730 రోజుల పాటు సెలవులు తీసుకోవచ్చు.
చైల్డ్ కేర్ లీవ్ సమయంలో ఎంత జీతం ఇస్తారు..?
How much salary is given during child care leave: చైల్డ్ కేర్ లీవ్ సమయంలో సర్వీస్ సభ్యునికి చెల్లించే జీతం విషయంలోనూ నిబంధనలు వెలువరించింది. మొత్తం 730 రోజుల్లో.. మొదటి 365 రోజులకు.. 80 నుంచి 100 శాతం వేతనం చెల్లిస్తారు. తదుపరి 365 రోజుల సెలవులకు 80 శాతం వేతనం చెల్లిస్తారు.
సెలవులు ఎన్ని విడతలుగా అంటే..?
3 to 6 Spells holidays in a Calendar: చైల్డ్ కేర్ లీవ్స్ అనేవి ఎప్పుడుపడితే అప్పుడు తీసుకోవడానికి లేదు. దానికి కూడా రూల్స్ ఉన్నాయి. సాధారణంగా.. ఒక క్యాలెండర్ ఇయర్లో 3 విడతలుగా మాత్రమే సెలవులు పెట్టుకునే అవకాశం ఉంది. అయితే.. ఈ చైల్డ్ కేర్ లీవ్ తీసుకునేది ఒక మహిళ అయితే మాత్రం.. క్యాలెండర్ ఇయర్లో 6 విడతల వరకూ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. ఇక, మరో విషయం ఏమంటే.. ఒక దఫా చైల్డ్ కేర్ లీవ్ తీసుకుంటే.. 5 రోజుల కన్నా ఎక్కువగా దరఖాస్తు చేసుకోవాలే తప్ప.. అంతకన్నా తక్కువ సెలవులు మంజూరు చేయరు.
Hyderabad Rains : వర్షంలో పిల్లల్ని బయటకు పంపిస్తున్నారా.. బీ కేర్‌ఫుల్
ప్రత్యేక సెలవు ఖాతా..
Special Leave Account: కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. చైల్డ్ కేర్ లీవ్ తీసుకున్న ఉద్యోగుల కోసం స్పెషల్ రిజిస్టర్ మెయింటెయిన్ చేస్తారు. మొత్తం 730 రోజుల సెలవుల్లో ఎన్ని వాడుకున్నారు? ఎప్పుడెప్పుడు సెలవు తీసుకున్నారు? ఇంకా ఎన్ని రోజుల సెలవులు ఉన్నాయి? అనే వివరాలు ఇందులో ఉంటాయి. అయితే.. రెగ్యులర్ సెలవులు ఇందులో కలపరు. అంటే.. ఈ లెక్క ప్రకారం ఇవి వాడుకోవచ్చు. ఆ లెక్క ప్రకారం రెగ్యులర్ సెలవులు కూడా తీసుకోవచ్చు.
ప్రొబేషనరీ ఉద్యోగుల విషయంలో ఎలా?
No childcare leave during probation: పైన చెప్పుకున్న నిబంధనలన్నీ సర్వీసు ఉద్యోగులకు సంబంధించినవి. ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్న ఉద్యోగులకు ఈ సెలవులు కచ్చితంగా ఇవ్వాలనే రూల్ లేదు. అరుదైన సందర్భాల్లో మాత్రమే వీరికి సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. అది కూడా.. పై అధికారులు సరైన కారణం అని భావిస్తేనే.. సెలవు మంజూరు చేసే ఛాన్స్ ఉంటుంది.
CRY Awareness: బాల కార్మిక వ్యవస్థపై 'చైల్డ్ రైట్స్ అండ్ యు' అవగాహన కార్యక్రమాలు