ETV Bharat / bharat

How EVM Machine Works Know A to Z Details : ఈవీఎం ఎలా పనిచేస్తుంది..? A to Z వివరాలు మీకోసం! - 1982

How EVM Machine Works Know A to Z Details: ఎన్నికలంటే.. ఒకప్పుడు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల హడావిడి ఉండేది. ఫలితాలు వెల్లడించడం ఓ ప్రహసనం. ఇప్పుడు 'ఈవీఎం'ల రాజ్యం నడుస్తోంది. అయితే.. EVM ఎలా పనిచేస్తుంది..? అనే విషయం మీకు తెలుసా..?

How EVM Machine Works A to Z Details
How EVM Machine Works Know A to Z Details
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 1:31 PM IST

How EVM Machine Works A to Z Details: ఈవీఎంలు వచ్చిన తర్వాత ఎన్నికల స్వరూపమే మారిపోయింది. ఈ సాంకేతికత ద్వారా ఎంతో సమయం కలిసి వస్తోంది. ఎన్నికల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. అయితే.. దీనిపై అనుమానాలు వ్యక్తం చేసే వారు కూడా ఇప్పటికీ ఉన్నారు. ఇవన్నీ పక్కనపెడితే.. అసలు ఈవీఎం ఎలా పని చేస్తుంది..? అధికారులు ఎలా ఆపరేట్ చేస్తారు..? వంటి పూర్తి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

ఈవీఎం అంటే.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(Electronic Voting Machine). EVM అనేది ఓట్లను వేయడానికి, లెక్కించడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరం. వివరంగా చెప్పాలంటే, EVMలు ఎలక్ట్రానిక్ రూపంలో ఓటర్ల ఓట్లను నమోదు చేస్తాయి. ఇది ఓట్లను నమోదు చేయడంలో, లెక్కింపులో మానవ శ్రమను, అధిక సమయాన్ని తగ్గిస్తోంది. 1982 నుంచి భారత ఎన్నికల సంఘం (ECI) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను (EVM) ఉపయోగిస్తోంది. వాటి అభివృద్ధిలో అనేక అధునాతన సాంకేతికతలు, తయారీలో కఠినమైన నాణ్యత నియంత్రణలు పూర్తిగా ట్యాంపర్ ప్రూఫ్‌గా ఉన్నాయి. EVMలను రెండు ప్రభుత్వ రంగ సంస్థలు.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు, ECIL హైదరాబాద్‌ సహకారంతో.. ఎన్నికల సంఘం అభివృద్ధి చేసింది. భారతదేశంలో వాడుకలో ఉన్న EVMలన్నీ ఈ రెండు సంస్థల ద్వారా తయారైనవే.

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం అంటే ఏమిటి?

What is an Electronic Voting Machine?: ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (EVM) అనేది ఎలక్ట్రానిక్ ఓటు రికార్డింగ్ పరికరం. EVM రెండు భాగాలను కలిగి ఉంటుంది. ఒకటి కంట్రోల్ యూనిట్, మరోటి బ్యాలెట్ యూనిట్. దాదాపు ఐదు మీటర్ల కేబుల్ ద్వారా ఈ రెండింటికీ కనెక్షన్​ ఉంటుంది. వీటి కంట్రోల్ యూనిట్.. ప్రిసైడింగ్ అధికారి లేదా పోలింగ్ అధికారి చేతిలో ఉంటుంది. బ్యాలెట్ యూనిట్ బూత్ లోపల ఉంటుంది. బ్యాలెట్ పేపర్‌ను జారీ చేయడానికి బదులుగా, కంట్రోల్ యూనిట్ బ్యాలెట్ బటన్‌ను నొక్కడం ద్వారా పోలింగ్ అధికారి బ్యాలెట్‌ను విడుదల చేస్తారు. ఇప్పుడు ఓటరు తాను వేయాలనుకున్న అభ్యర్థి ఎన్నికల గుర్తుకు ఎదురుగా ఉన్న బటన్​ను ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఓటరు తన ఓటు ఎవరికి వేశాడన్నది.. ప్రిసైడింగ్ అధికారులకు కూడా తెలిసే అవకాశం ఉండదు.

EVMల ముఖ్య లక్షణాలు (Salient Features of EVMs) :

  • ఈవీఎంలను తొలిసారిగా 1982లో కేరళలోని పరవూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉపయోగించారు.
  • ఈవీఎంలకు కరెంటు అవసరం లేదు.
  • భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్/ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అసెంబుల్ చేసిన సాధారణ బ్యాటరీలతో పనిచేస్తాయి.
  • ECI ఉపయోగించే ఒక EVM గరిష్టంగా 2వేల ఓట్లను నమోదు చేయగలదు.
  • M3 EVM పరికరాలు 24 బ్యాలెట్ యూనిట్‌లను కనెక్ట్ చేయడం ద్వారా నోటాతో సహా గరిష్టంగా 384 మంది అభ్యర్థులకు సేవలు అందిస్తాయి.
  • డేటా తొలగించే వరకు లేదా క్లియర్ అయ్యే వరకు కంట్రోల్ యూనిట్ ఫలితాన్ని దాని మెమరీలో నిల్వ చేసుకుంటుంది.
  • EVM జీవితకాలం 15 సంవత్సరాలు.

VVPAT అంటే ఏమిటి?

What is VVPAT?: ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (VVPAT) అనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లకు అనుసంధానించిన యంత్రం. ఇది బ్యాలెట్ యూనిట్‌లో వారు ఎంచుకున్న అభ్యర్థికి తమ ఓటు నమోదు అయ్యిందా లేదా అని ఓటరుకు చూపుతుంది. ఇందులో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు, క్రమ సంఖ్య ఉంటుంది. VVPAT లో కనిపించిన ఓటు.. వేసిన ఓటు సరిపోలకపోతే.. ఓటరు వెంటనే ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకురావాలి. వారు సమస్యను గుర్తించి సరి చేస్తారు.

EVMలను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

What are the Advantages of Using EVMs?

  • పారదర్శకత, ఖచ్చితత్వం: బ్యాలెట్ పేపర్ల సమయంలో.. ప్రతి ఎన్నికలలో పెద్ద సంఖ్యలో గుర్తించిన 'చెల్లని ఓట్లు' వేసే అవకాశాన్ని ఇది పూర్తిగా తొలగిస్తుంది.
  • బ్యాలెట్ల ముద్రణ ఖర్చు ఆదా..: ఈవీఎంల ద్వారా.. ప్రతి ఓటరుకు ఇవ్వాల్సిన బ్యాలెట్ పేపర్ ప్రింటింగ్ ఖర్చును బాగా తగ్గించాయి. EVMలను ఉపయోగించడం ద్వారా, ఏ ఎన్నికలకైనా మిలియన్ల కొద్దీ బ్యాలెట్ పత్రాలను ముద్రించడం ఉండదు. ఇది కాగితం, ప్రింటింగ్, షిప్పింగ్, నిల్వ, పంపిణీ ఖర్చులను తగ్గించి.. డబ్బు ఆదా చేయడానికి ఉపయోగపడుతుంది.
  • కౌంటింగ్ సమయంలో సమయం ఆదా.. ఈవీఎం సాయంతో ఓట్ల లెక్కించడం వల్ల సమయం ఆదా అవుతుంది. కౌంటింగ్ ప్రక్రియ చాలా వేగంగా ఉంటుంది. అలాగే ఫలితాలను కూడా కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ప్రకటించవచ్చు.

EVMల సాంకేతిక భద్రతా లక్షణాలు:

Technical Security Features of EVMs:

  • EVMలు స్వతంత్ర పరికరాలు. రిమోట్‌గా అందుబాటులో ఉండవు.
  • సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ కంట్రోల్ యూనిట్ (CU), బ్యాలెట్ యూనిట్ (BU), VVPATలో ఒకే సారి ప్రోగ్రామ్ చేయవచ్చు. కానీ చదవడానికి లేదా తిరిగి రాయడానికి వీలుకాదు.
  • ఈ ప్రోగ్రామ్‌ను వివిధ IITల నుంచి ప్రముఖ ప్రొఫెసర్‌లతో కూడిన సాంకేతిక నిపుణుల కమిటీ (TEC) అభివృద్ధి చేసి ఆమోదించింది.
  • డైరెక్టరేట్ ఆఫ్ స్టాండర్డైజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంప్లయన్స్ (STQC) టెస్ట్​ నిర్వహిస్తుంది.
  • EVMలలోని ప్రతి కీ సిస్టమ్‌లోని సమయం, తేదీ స్టాంప్‌తో సైన్ ఇన్ అవుతుంది.
  • EVMల భద్రతకు.. రెండుసార్లు తాళం వేసి, పోలీసుల రక్షణలో ఉంచుతారు.
  • రాజకీయ పార్టీలు, వారి సభ్యుల సమక్షంలో కార్యాచరణ సమీక్షలు నిర్వహిస్తారు. (మొదటి దశ తనిఖీ).
  • రాజకీయ పార్టీల నేతల సమక్షంలో కూడా రక్షణ ముద్రలు వేస్తారు.
  • రాండమైజేషన్ ఎల్లప్పుడూ రాజకీయ పార్టీలు / అభ్యర్థుల సమక్షంలో నిర్వహిస్తారు.
  • పోలింగ్ ప్రారంభమయ్యే ముందు EVMలు / VVPATల సీలింగ్​పై పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెడతారు.
  • పోలింగ్ ముగిసిన తర్వాత EVMలు / VVPAT ఉన్న కేసులపై ముద్రలు, అలాగే పోలింగ్ ఏజెంట్లు సంతకాలు పెడతారు.
  • స్ట్రాంగ్ రూమ్ డోర్ వద్ద డబుల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది.
  • అభ్యర్థుల క్యాంపింగ్ ప్రాంతానికి స్ట్రాంగ్​ రూమ్​ CCTV ఫీడ్‌లు పంపిస్తారు.
  • స్ట్రాంగ్​ రూమ్​ చుట్టు రెండంచెల భద్రత ఉంటుంది.(CAPF, రాష్ట్ర సాయుధ పోలీసులు)

EVM ఉపయోగించి ఓటు ఎలా వేయాలి?

How to cast your vote using an EVM?

  • మీరు పోలింగ్ కంపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించేటప్పుడు ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ యూనిట్‌ను ప్రారంభిస్తారు.
  • మీకు నచ్చిన అభ్యర్థి పేరు/చిహ్నానికి అనుగుణంగా బ్యాలెట్ యూనిట్‌లోని బ్లూ బటన్‌ను నొక్కండి.
  • మీరు ఎంచుకున్న అభ్యర్థి పేరు లేదా గుర్తుకు వ్యతిరేకంగా రెడ్ లైట్ మెరుస్తుంది.
  • ప్రింటర్ మీరు ఎంచుకున్న అభ్యర్థి క్రమ సంఖ్య, పేరు, చిహ్నాన్ని కలిగి ఉన్న బ్యాలెట్ స్లిప్‌ను ప్రింట్ చేస్తుంది.
  • స్లిప్ 7 సెకన్ల పాటు కనిపిస్తుంది. ప్రింట్‌అవుట్ మీకు ఇవ్వరు కాబట్టి.. మీరు బ్యాలెట్ యూనిట్‌లోని గ్లాస్ ప్యానెల్ ద్వారా ప్రింట్‌ను తనిఖీ చేయాలి.
  • స్లిప్ ఆటోమెటిక్​గా కట్​ అయ్యి.. సేకరణ బిన్‌లో పడిపోతుంది.
  • ఒకవేళ మీకు బ్యాలెట్ స్లిప్ కనిపించకపోయినా.. బదులుగా బీప్ సౌండ్​ వినిపించకపోయినా మీరు ప్రిసైడింగ్ అధికారిని సంప్రదించాలి.

రిమోట్ ఓటింగ్ యంత్రాలపై ఈసీ అవగాహన.. కొత్త విధానానికి విపక్షాలు నో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.