భారీ వర్షాల కారణంగా (Rain in Tamilnadu) ఇల్లు కూలి 9 (house collapse news) మంది ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులోని వెల్లూర్‌లో ఈ ఘటన జరిగింది.
వరద ముంచెత్తిన కారణంగా పెరనంపట్టు ప్రాంతంలో నివసిస్తున్న రెండు కుటుంబాలు.. ఇంటి దాబాపైకి వెళ్లారు. మొత్తం 17 మంది పైకి చేరుకున్నారు. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల అప్పటికే బలహీనంగా మారిపోయిన ఇల్లు (house collapse news).. ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో నలుగురు చిన్నారులు సహా తొమ్మిది మంది చనిపోయారు.
మరో ఎనిమిది మంది శిథిలాల కింద చిక్కుకోగా.. అగ్నిమాపక దళాలు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి వారిని బయటకు తీశారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
పరిహారం
ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విచారం వ్యక్తం చేశారు. ప్రాణనష్టం జరగడం బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
ఇదీ చదవండి: ఆగని వర్షాలు.. ఆ రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు