ETV Bharat / bharat

కోడలి ముఖంపై వేడివేడి నూనె పోసిన అత్తామామ.. 6ఏళ్లైనా పిల్లలు పుట్టట్లేదని.. - వరకట్నం తేలేదని కోడలిపై దాడి

మహిళ ముఖంపై వేడి నూనెను పోసిన ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది. పెళ్లై ఆరేళ్లయినా ఇంకా పిల్లలు లేరని ఈ దారుణానికి పాల్పడ్డారు బాధితురాలి భర్త, అత్తమామలు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

parwaliya police station mp
వేడి నూనెను కోడలి ముఖంపై పోసిన అత్తమామలు
author img

By

Published : Jul 9, 2022, 11:06 AM IST

మధ్యప్రదేశ్​.. భోపాల్ దారుణం జరిగింది. పెళ్లై ఆరేళ్లయినా ఇంకా పిల్లలు లేరని మహిళపై దారుణానికి పాల్పడ్డారు ఆమె భర్త, అత్తమామలు. వేడి నూనెను తెచ్చి మహిళ నిద్రిస్తున్న సమయంలో ఆమె ముఖంపై పోశారు. ఈ దాడిలో బాధితురాలి ముఖం మొత్తం కాలిపోయింది. నిందితులపై పర్వాలియా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

అసలేం జరిగిందంటే: భోపాల్‌.. పర్వాలియా ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతికి ఆరేళ్ల క్రితం ప్రతాప్ బంజారా అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక మూడేళ్ల పాటు కొన్ని కారణాల వల్ల బాధితురాలు పుట్టింట్లో ఉండిపోయింది. మూడేళ్ల క్రితం తిరిగి అత్తవారింటికి వచ్చింది. ఇన్నేళ్లైనా పిల్లలు లేరని అత్తవారు తిట్టేవారు. అంతేకాకుండా వరకట్నం తేవాలని వేదించేవారు. బుధవారం రాత్రి బాధితురాలు తన భర్తతో కలిసి నిద్రపోతోంది. ఈ సమయంలో బాధితురాలి అత్తమామలు, బావ.. వేడి నూనె తెచ్చి ఆమె ముఖంపై పోసేశారు. వారికి ఆమె భర్త ప్రతాప్ బంజారా సైతం సహకరించాడు. దీంతో బాధితురాలి ముఖం మొత్తం కాలిపోయింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చదవండి: ఆ సమస్య తీరేవరకు నో హనీమూన్.. వాటర్ ట్యాంకర్​పై వధూవరుల ఊరేగింపు

ఆమ్నెస్టీ ఇండియాకు ఈడీ షాక్.. రూ.61.72 కోట్ల జరిమానా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.