ETV Bharat / bharat

'ఒబామాకు ఆతిథ్యమిచ్చినట్టు.. వారినీ ఇంటికి పిలవండి' - ఓవైసీ

ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ.. గుజరాత్​ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శల వర్షం కురిపించారు. గతంలో ఒబామాకు ఆతిథ్యం ఇచ్చినట్లు రైతులను సైతం ఆయన నివాసానికి ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలన్నారు. రైతు ఉద్యమం కారణంగా మోదీకి నిద్రపట్టటం లేదన్నారు.

Host farmers at your house like you treated Obama:Owaisi to PM
రైతు ఉద్యమం కారణంగా మోదీకి నిద్రపట్టటం లేదు: ఓవైసీ
author img

By

Published : Feb 8, 2021, 6:34 AM IST

గుజరాత్​ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ. గతంలో బరాక్ ఒబామాను తన ఇంటికి ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చినట్లుగానే.. సాగు చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులను కూడా పిలిపించి ఆతిథ్యం ఇవ్వాలన్నారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రధాని పెద్ద మనసుతో.. రెండు నెలలుగా ఉద్యమిస్తున్న రైతుల గోడు పట్టించుకోవాలన్నారు.

"రైతులతో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదు. ప్రధాని రైతులను తన ఇంటికి పిలిచి టీ ఇచ్చి.. సాగు చట్టాలను రద్దు చేస్తానని చెప్పాలి. అప్పుడు రైతులు సంతోషంగా ఉంటారు. పేదరికం నుంచి వచ్చానని చెప్పుకునే మోదీ.. రైతుల సమస్యలను అర్థం చేసుకోవాలి."

----అసదుద్దీన్​ ఓవైసీ,

ఏఐఎమ్​ఐఎమ్​ అధినేత

రైతు ఉద్యమం కారణంగా మోదీకి నిద్రపట్టటం లేదన్నారు అసదుద్దీన్​ ఓవైసీ. రైతులకు తాము అండగా ఉంటామన్నారు.

గుజరాత్​ స్థానిక ఎన్నికల్లో బీటీపీతో పొత్తు కుదుర్చుకుని బరిలోకి దిగనుంది ఏఐఎమ్​ఐఎమ్​. ఈ క్రమంలోనే బరూచ్​ వేదికగా జరిగిన ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్నారు ఓవైసీ.

ఇదీ చదవండి : గుజరాత్​ ప్రజల మనసు గెలుచుకుంటాం: ఓవైసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.