మలయాళ భాషకు సంబంధించి దిల్లీ జిప్మెర్ జారీ చేసిన ఆదేశాలపై తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. నర్సులు.. పని ప్రదేశంలో మలయాళం మాట్లాడకూడదని.. హిందీ లేదా ఇంగ్లీష్‌నే వాడాలని స్పష్టం చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన కారణంగా ఉత్తర్వులను వెనక్కి తీసుకుంది ఆసుపత్రి.
ఎందుకు ఈ నోటీసులు..
"దేశంలోని ఇతర భాషల్లాగే మలయాళం కూడా భారతీయ భాషే. భాష పరమైన వివక్షను ఆపండి."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
రాజ్యంగ విరుద్ధం..
అనాగరిక, రాజ్యాంగ విరుద్ధ ఉత్తర్వులను రద్దు చేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను కోరారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణు గోపాల్.
"ప్రపంచవ్యాప్తంగా రోగుల క్షేమం కోసం కేరళ నర్సులు పనిచేస్తున్నారు. ఒక ప్రాంతానికి చెందినవారు వారిలో వారు మాతృభాషలో మాట్లాడతారు. భాష తెలియనివారితోనూ మలయాళంలోనే మాట్లాడతారని అనుకోవడంలో అర్థం లేదు. ఈ ఆదేశాలు ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా, వివక్షపూరితం."
- కేసీ వేణు గోపాల్, కాంగ్రెస్ ఎంపీ
మానవ హక్కుల ఉల్లంఘన..
"భాష అర్థమయ్యే వారితో తమ మాతృభాషలో మాట్లాడవద్దని ప్రజాస్వామ్య భారత్‌లో ఓ ప్రభుత్వ సంస్థ చెప్పడం విడ్డూరం. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఆదేశాలు భారత పౌరుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలి," అని తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ట్వీట్ చేశారు.
ఇవీ చూడండి:
హిందీ భాష అమలుపై వెనక్కి తగ్గిన కేంద్రం