Horoscope Today(14/06/2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
ప్రారంభించిన కార్యక్రమాల్లో విజయసిద్ధి ఉంది. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారి సహాయ సహకారాలు ఉన్నాయి. దైవబలం రక్షిస్తోంది. శ్రీ వెంకటేశ్వర దర్శనం శుభప్రదం.
మీ మీ రంగాల్లో శుభఫలితాలను అందుకుంటారు. ప్రయత్నబలాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడుపుతారు. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.
ప్రయత్నకార్యానుకూలత ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ఈశ్వరారాధన సత్ఫలితాలను ఇస్తుంది.
విందు,వినోదాలతో కాలం గడుస్తుంది. చేపట్టిన పనులను ప్రణాళికతో పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు మీలో ఉత్సాహాన్ని పెంచుతాయి. ముఖ్య విషయాలను సాయంకాలం తరువాత చేయడం ఉత్తమం. ఇష్ట దైవాలయ సందర్శనం మరింత శుభాన్ని చేకూరుస్తుంది.
ముఖ్య విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతి అడుగు లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు వేయండి. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆరోగ్యం కాస్త ఫర్వాలేదనిపిస్తుంది. ఇష్టదైవ స్తోత్రాలు చదివితే మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి.
శుభాలు చేకూరుతాయి. ఒక వ్యవహారంలో తోటివారి సాయం అందుతుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆదిత్య హృదయం చదవాలి.
మీ ప్రతిభ,పనితీరుకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబంలో అభిప్రాయబేధాలు రానీయకండి. బంధు,మిత్రుల వల్ల ధనవ్యయం జరుగుతుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదవాలి.
మధ్యమ ఫలాలు ఉన్నాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. అవసరానికి సాయం చేయడానికి కొందరు ముందుకు వస్తారు. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు. హనుమాన్ చాలీసా చదవాలి.
చిత్తశుద్ధితో పనులను ప్రారంభిస్తారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. అవసరానికి సహాయం చేసేవారు ఉంటారు. అతిగా ఎవరినీ నమ్మరాదు. ఆంజనేయ ఆరాధన శుభప్రదం.
వృత్తి,ఉద్యోగ,వ్యాపారాది రంగాలలో శుభఫలితాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. చేపట్టిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయగలుగుతారు. బంధు,మిత్రులతో వాగ్వాదాలకు దిగవద్దు. దైవారాధన మానవద్దు.
దైవబలంతో పనులను పూర్తిచేస్తారు. సుఖ సౌఖ్యాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన విషయమై పెద్దలను కలుస్తారు. ఫలితం అనుకూలంగా వస్తుంది. మిత్రుల సహకారం ఉంటుంది. శనిధ్యానం శుభదాయకం.
బుద్ధిబలం బాగుంటుంది. ఒక శుభవార్త వింటారు. ఒక వ్యవహారంలో చంచలబుద్ధితో వ్యవహరించి ఇబ్బందులు పడతారు. అధికారులతో కొన్ని ముఖ్య విషయాలలో అభిప్రాయబేధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దైవారాధన మానవద్దు.