Horoscope Today(13/06/2022): ఈ రోజు గ్రహ బలం, శుభముహూర్తంతో పాటు.. పన్నెండు రాశుల వారి సమయం ఎలా ఉందో తెలుసుకోండి.
శారీరక శ్రమ అధికమవుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో చంచల స్వభావాన్ని రానీయకండి. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. అష్టమ చంద్ర సంచారం అనుకూలంగా లేదు. చంద్ర ధ్యానాన్ని జపిస్తే మేలు జరుగుతుంది.
ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతిని ఆరాధించడం మంచిది.
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. దైవబలం సంపూర్ణంగా రక్షిస్తుంది. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం.
పట్టుదలతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చులు సూచితం. శ్రమ అధికమవుతుంది. దుర్గ అష్టోత్తరం చదివితే మంచిది.
ముందస్తు ప్రణాళికలతో పనులను పూర్తి చేస్తారు. ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచల బుద్ధిని వీడాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. విష్ణుసహస్రనామ పారాయణ శ్రేయోదాయకం.
శుభ కాలం. పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలమైన సమయం. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఇష్టదైవ ఆరాధన చేసుకుంటే మంచిది.
భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. మంచి ఆలోచనా విధానంతో ముందుకు సాగండి చక్కటి ఫలితాలు సొంతమవుతాయి. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. తోటివారితో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలి. సూర్య ఆరాధన శుభప్రదం.
మీలోని నైపుణ్యంతో గొప్ప పేరును సంపాదిస్తారు. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అర్థలాభం ఉంది. ఈశ్వర దర్శనం చేయడం మంచిది.
ఒక వ్యవహారంలో శతృవులపై విజయం సాధిస్తారు. అనుకూల ఫలితాలున్నాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనో బలం తగ్గకుండా చూసుకోవాలి. ప్రశాంతతకు దుర్గ ధ్యానం, విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి.
అనుకూల ఫలితాలున్నాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి.
చక్కని విజయాలున్నాయి. కీలక వ్యవహారాలలో కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. సంతాన అభివృద్ధికి సంబందించిన శుభవార్త వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయాలి.
ముఖ్య విషయాల్లో ఆచితూచి ముందుకు సాగితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులతో వాగ్వాదాలకు దిగవద్దు. చేపట్టే పనులను ప్రణాళికాబద్దంగా చేయకపోవడం వలన ఆటంకాలు తప్పవు. దైవారాధన మానవద్దు.