Horoscope Today(08-02-2022): ఈ రోజు రాశిఫలాల గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే..
మేషం:
కార్యానుకూలత ఉంది. సంఘటనలు ఉత్సాహాన్నిఇస్తాయి. అనవసర ఆలోచనల్ని దరిచేరనీయకండి. శ్రీవిష్ణు దర్శనం శుభప్రదం.
వృషభం:
శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. బద్ధకించకుండా పనిచేస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. అధికారులు లేదా పెద్దలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. సహనాన్ని కోల్పోకండి. గోసేవ మేలు చేస్తుంది.
మిథునం:
నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య పరిష్కారమయ్యే సూచన ఉంది. దైవ చింతన ద్వారా మానసిక ప్రశాంతత కలుగుతుంది. సూర్య స్తోత్రం చదివితే మంచిది.
కర్కాటకం:
ప్రారంభించబోయే పనుల్లో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగండి. కొందరి ప్రవర్తన బాధ కలిగిస్తుంది. కొన్ని సంఘటనలు నిరుత్సాహపరుస్తాయి. సమయానికి నిద్రాహారాలు తీసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. దుర్గా అష్టోత్తర శతనామావళి చదవాలి.
సింహం:
ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తిచేస్తారు. మీ పనితీరుతో పెద్దలను మెప్పిస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇష్టదైవ స్మరణ వల్ల మంచి జరుగుతుంది.
కన్య:
బంధు,మిత్రులను కలుపుకొనిపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. ప్రయాణాలు సుఖవంతం అవుతాయి. శివుడిని ఆరాధిస్తే మంచిది.
తుల:
ఆశయాలు సిద్ధిస్తాయి. మీ పనితీరుకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధు,మిత్రులతో కలిసి చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎక్కువ సమయం అభివృద్ధి కోసం కేటాయించడం మంచిది. లింగాష్టకం చదవడం శుభప్రదం.
వృశ్చికం:
ఒక ముఖ్య వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రారంభించిన పనులలో ఊహించని ఫలితాలు వెలువడతాయి. బంధు,మిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇష్టదైవ దర్శనం శుభప్రదం.
ధనుస్సు:
మనోబలంతో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. గిట్టనివారి మాటలను పట్టించుకోకండి. కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తి అవసరం. శివారాధన మంచిది.
మకరం:
స్థిరమైన నిర్ణయాలతో ముందుకు సాగండి. సత్ఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో సానుకూల ఫలాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోండి అంతా మంచే జరుగుతుంది. శివుడిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి.
కుంభం:
మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. ఈశ్వరదర్శనం శుభకరం.
మీనం:
కాలాన్ని సద్వినియోగం చేసుకొనే దిశగా ముందుకు సాగుతారు. ఉత్సాహంగా ఉంటారు. ప్రారంభించిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శివారాధన మంచిది.
ఇదీ చదవండి: పంజాబ్ ఎన్నికల వేళ.. డేరా బాబాకు పెరోల్