Horoscope Today: ఈ రోజు(నవంబర్ 24) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?

చేపట్టే పనుల్లో ప్రతికూల పరిస్థితులు ఎదురవ్వకుండా చూసుకోవాలి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన చేస్తే మంచిది.

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది.

ఉత్సాహభరితమైన వాతావరణం ఉంటుంది. మీకు కొత్త బాధ్యతలను పెద్దలు అప్పగిస్తారు. మానసికంగా ద్రుఢంగా ఉంటారు. బంధు గృహాలయందు సుఖ భోజనం చేస్తారు. కీలక విషయాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇష్టదైవ నామస్మరణ మంచిది.

నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ కాస్త పెరగుతుంది. బంధువులతో వాదులాటలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. దైవారాధన మానవద్దు.

ముఖ్య విషయాల్లో పెద్దల ఆశీర్వచనాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర ధనవ్యయం సూచితం. ఇష్టదేవతా స్తోత్రం పారాయణ చేస్తే మంచిది.

ఏ పని తలపెట్టినా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మేలైన ఫలితాలుంటాయి. ఆర్థిక పరమైన విషయాలలో మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. ఇష్టదైవారాధన శుభప్రదం.

చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. బంధుమిత్రులతో విబేదాలు రావచ్చు. చంద్ర శ్లోకం చదవాలి.

ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి విషయాన్ని కుటుంబంతో చర్చించి మొదలుపెట్టాలి. సౌభాగ్యసిద్ధి ఉంది. లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది.

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తనాశైలి మిమ్మల్ని బాదిస్తుంది. అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. విష్ణు నామస్మరణ మంచిచేస్తుంది..

ప్రశాంతమైన మనస్సుతో ముందుకు సాగండి అన్ని మంచి ఫలితాలే పొందుతారు. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు. గణపతిని ఆరాధించడం మంచిది

శరీరసౌఖ్యం కలదు. భవిష్యత్ ప్రణాళికలను రచిస్తారు. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. తోటి వారితో ఆనందంగా గడుపుతారు. కాలం అనుకూలంగా ఉంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది.

చేపట్టే పనుల్లో విజయం చేకూరుతుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని సంఘటనలు సంతోషాన్నిస్తాయి. దైవారాధన మానవద్దు.