ETV Bharat / bharat

Horoscope Today Telugu : ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే? - ఈ రోజు మీ రాశిఫలం 2023 ఆగస్టు 5

Today Horoscope August 5th 2023 In Telugu : ఈ రోజు (ఆగస్టు 5) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Today Horoscope 2023 August 5th In Telugu
ఈ రోజు మీ రాశి ఫలం ఎలా ఉందంటే?
author img

By

Published : Aug 5, 2023, 6:24 AM IST

Horoscope Today August 5th : ఈ రోజు (ఆగస్టు 5) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. మీకు అప్పజెప్పిన పనిని శక్తివంతంగా, ఉత్సాహంతో పూర్తి చేస్తారు. సానుకూల గృహ వాతావరణం ఏర్పడుతుంది. దీంతో మీరు మీ కుటుంబ సభ్యులతో అద్భుతమైన సమయాన్ని గడుపుతారు. ఇది మీలో ఉత్తేజాన్ని నింపుతుంది. సాయంత్రం మిత్రులతో కలిసి ముచ్చటిస్తారు లేదా పార్టీకి వెళ్తారు.

.

ఈ రోజు సంతోషంగా గడుపుతారు. మీ స్నేహితులు, ప్రియమైన వారు ఆప్యాయతతో కూడిన వాతావరణాన్ని మీకు కల్పిస్తారు. కొత్త పరిచయాలు, స్నేహాలు మీ వ్యాపారానికి లేదా వృత్తికి ప్రయోజనం చేకూర్చవచ్చు. ఒక చిన్న విహారయాత్ర మీలో చాలా సంతోషాన్నిస్తుంది. మొత్తంగా ఈరోజు మీకు అన్నివిధాలా మంచి జరుగుతుంది.

.

ఈరోజు మీకు అదృష్టమైన రోజు. జీవిత భాగస్వామి అన్వేషణలో ఉన్నవారికి తగిన జోడి దొరకవచ్చు. ఆర్ధిక ప్రయోజనాలు పొందుతారు. స్నేహితులను కలవడం, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం వల్ల మీ ఈ రోజు ఫలవంతం అవుతుంది. అన్ని విషయాలు కలిసి వస్తాయి. మీ పిల్లల నుంచి శుభవార్తను ఆశిస్తారు.

.

ఈరోజు స్త్రీ అదృష్టం మీ వైపే ఉంది. మీరు ఒక చిన్న విహారయాత్ర లేదా తీర్థయాత్ర కోసం ప్రణాళిక చేయవచ్చు. ఇది మిమ్మల్ని ఆనందానికి గురిచేస్తుంది. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. ఈ రోజు మొత్తం ప్రశాంతంగా గడుపుతారు. మీ స్నేహితులు, ప్రియమైన వారితో సంతోషంగా గడపే సూచనలు ఉన్నాయి.

.

ఈ రోజు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వైద్యానికి సంబంధించి ఖర్చులు ఎక్కువ చేసే అవకాశం ఉంది. బయట తిండి తినకుండా ఉంటే మంచిది. కొన్ని నెగిటివ్​ ఆలోచనలు మిమ్మల్ని రోజంతా ఇబ్బంది పెట్టవచ్చు. వీటికి వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ధ్యానం మీ సమస్యలను అధిగమించి మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.

.

ఈరోజు మీకు శుభప్రదంగా ఉండవచ్చు. మీరు సులభంగా పేరు ప్రఖ్యాతలను పొందే అవకాశం ఉంది. వ్యాపారస్థులకు ఈరోజు అనుకూలంగా ఉంది. వ్యాపారంలోని భాగస్వాముల మధ్య అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. కొత్త వస్తువుల కొనుగోలు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన పర్యటన చేస్తే మంచిది.

.

ఈ రోజు శారీరకంగా దృఢంగా ఉంటారు. వృత్తి పరంగా ప్రయోజనం పొందుతారు. మీ సహోద్యోగులు చాలా సహాయకరంగా ఉంటారు. అంతేగాక వ్యక్తిగతంగా ఈ రోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా సమయం గడపే అవకాశం ఉంది. మీరు తలపెట్టే ప్రతి పనిలో విజయం మిమ్మల్నే విరించే అవకాశాలు ఉన్నాయి. దీంతో మీరు పేరు ప్రతిష్ఠలు పొందుతారు.

.

ఈరోజు ఎవరితోనూ గొడవలకు దిగకుండా ఉంటే మంచిది. పిల్లలకు సంబంధించిన సమస్యలు మీకు ఇబ్బంది కలిగించవచ్చు. విద్యార్థులు విజయవంతం కావడానికి అవకాశం ఉంది. అది వారికి చదువుల పట్ల ఉన్న ఉత్సాహాన్ని మరింత బలోపేతం చేస్తుంది. షేర్ మార్కెట్లు లేదా పందాలలో పెట్టుబడి పెట్టకుండా ఉంటే మంచిది. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు కూడా మానుకోండి.

.

మానసిక అశాంతి వలన ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండరు. రోజు మొత్తం అస్థిరమైన కుటుంబ వాతావరణం ఏర్పడుతుంది. దీంతో మీ కుటుంబ సభ్యులతో గొడవలకు దిగుతారు. ఆస్తులకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. ఆర్థికంగా నష్టపోవచ్చు.

.

ఈ రోజు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఒక ఆహ్లాదకరమైన పర్యటన చేసే అవకాశం ఉంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాలపై శ్రద్ధ వహిస్తారు. ఉద్యోగస్థులకు, విద్యార్థులకు అనుకూలంగా ఉండవచ్చు. మీ పోటీదారులను ఈరోజు మీరు అధికమిస్తారు. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు.

.

అన్ని విషయాలపై మీరే నిర్ణయం తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అవనసరపు ఖర్చులు చేయకండి. నోరును అదుపులో పెట్టుకోండి. లేదంటే మీ కుటుంబ సభ్యులతో గొడవలు జరగవచ్చు. విద్యార్థులు చదువులపై దృష్టి పెట్టాలి. సత్ఫలితాలు రావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఓపికతో ఉండండి.

.

ఈరోజు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారు. కొత్త పనులను మొదలుపెట్టడానికి మీ ఉత్సాహమే మీకు చేయూతనిస్తుంది. మీ కుటుంబ జీవితం స్నేహపూర్వకంగా ఉంటుంది. స్నేహితులు, ప్రియమైన వారితో చేసే ఒక విహారయాత్ర మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్రలకు, ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.