Horoscope Today : ఈ రోజు(సెప్టెంబరు 8) రాశి ఫలం గురించి డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ ఏమన్నారంటే?
ధనాగమనసిద్ధి ఉంది. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధు,మిత్రులను కలుస్తారు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. విష్ణు నామస్మరణ ఉత్తమం.
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. శ్రమతో కూడిన ఫలితాలు ఉన్నాయి. గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి.గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సందర్శనం శ్రేయోదాయకం.
మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేయకండి. ఈశ్వర దర్శనం మంచిది.
అందరినీ కలుపుకొనిపోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. ఇష్టదైవ ప్రార్ధన శుభప్రదం.
మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పనితలపెట్టినా ఇట్టే పూర్తిచేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబసభ్యులకు మేలైన కాలం. దైవారాధన మానవద్దు.
ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది.
కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధు,మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది.
ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. స్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది.
స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు. శివారాధన చేయడం మంచిది.
మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి.మనఃస్సౌఖ్యం ఉంది.బంధు,మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆదిత్య హృదయం చదవడం మంచిది.